ఎన్టీఆర్ - నీల్ మూవీ షూటింగ్ అప్డేట్..తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 16 Jan 2026 11:57 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చివరిగా 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. నెమ్మదిగా 600 కోట్ల క్లబ్లో చేరి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అక్కడ హృతిక్ రోషన్ హీరోగా , కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన వార్ 2 చిత్రంలో విలన్ గా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా చేశారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పైనే అనే చెప్పాలి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది మార్చిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ ఇప్పుడు అభిమానులలో అంచనాలు పెంచేసింది.
ఇకపోతే ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ షెడ్యూలు గతవారం ముగిసింది. ఈ షూటింగ్ ఎక్కువగా రాత్రుల్లో జరిపారు. ఇక రేపటి నుంచి రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. అలాగే ఈనెల ఆఖరి వరకు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగబోయే షెడ్యూల్ కోసం చిత్ర బృందం మొత్తం జోర్డాన్ కి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. గత రెండు నెలల్లో రెండుసార్లు రెక్సీ నిర్వహించిన తర్వాత ప్రశాంత్ నీల్, అతని బృందం లొకేషన్ లాక్ చేశారు.
ముఖ్యంగా ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్లే.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది జూన్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసమే గతంలో చాలా బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ కొంచెం బరువు పెరగాడని చెప్పవచ్చు. నిన్న ఈయనకు సంబంధించిన లుక్ కూడా వైరల్ అవ్వగా మాస్ లుక్ లో అందర్నీ ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఎయిర్పోర్టులో కనిపించిన ఈయన లుక్కు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రశాంత్ నీళ్ సినిమాలంటేనే హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫామెన్స్ చిత్రాలు.. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ తో అలాంటి చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో ఇది పక్కా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు కూడా అప్పుడే కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
