Begin typing your search above and press return to search.

'డ్రాగన్' మూవీ క్లైమాక్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో డిజైన్ చేశారా?

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే... వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   22 Sept 2026 12:00 AM IST
డ్రాగన్ మూవీ క్లైమాక్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో డిజైన్ చేశారా?
X

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే... వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. అందులో మూవీ వరల్డ్ ను పరిచయం చేశారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారనే విషయం ఆ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది...ఇక ప్రశాంత్ నీల్ మూవీ అంటే యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తారు. కాబట్టి ఈ సినిమాలో కూడా వాటిని హైలెట్ చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ సినిమా మొత్తం దేశాన్ని నాశనం చేసే ఒక గ్యాంగ్ కోసం పని చేస్తాడు. కానీ అప్పుడే ఆయన వాళ్ల దగ్గర ఎందుకోసం పని చేయాల్సి వచ్చింది అసలు ఆయన ఎవరు? వాళ్లకి తనకి మధ్యనున్న సంబంధం ఏంటనే విషయాలు రివిల్ అవుతాయట.

మొత్తానికైతే ఎన్టీఆర్ క్లైమాక్స్ లో తన నట విశ్వరూపం చూపిస్తాడట. ఇక ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు చేసిన కెజిఎఫ్, సలార్ రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నాడు. ఈ మూవీ లో కూడా అలాంటి క్యారెక్టర్ నే డిజైన్ చేశాడు కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటీ గా ఉన్నాడట. మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ మూవీ పెను సంచలనాన్ని క్రియేట్ చేయడం పక్కా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు... ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరియర్ లో సోలోగా ఒక్క మూవీతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేదు. తన తోటి హీరోలు 2000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి ట్రై చేస్తుంటే తను ఇంకా 1000 కోట్ల దగ్గరే ఉన్నాడు.

కాబట్టి ఈ మూవీతో ఎలాగైనా సరే డైరెక్ట్ గా 2000 కోట్ల మార్క్ ను అందుకోవాలనే ప్రయత్నం లో తారక్ ఉన్నట్టుగా తెలుస్తుంది...ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పురాణాల నేపథ్యంలో ఒక సినిమాని చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు. ఇక డ్రాగన్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో దాన్ని బట్టి ఎన్టీఆర్ మార్కెట్ ఎంత అనే విషయాల మీద అందరికీ పూర్తి క్లారిటీ వస్తుంది. దాంతో త్రివిక్రమ్ సినిమా మీద ఎంత బడ్జెట్ పెట్టవచ్చు అనేది నిర్ణయిస్తారా? ఏది ఏమైనా కూడా 'డ్రాగన్' సినిమా సక్సెస్ అనేది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి చాలా కీలకంగా మారనుంది...