Begin typing your search above and press return to search.

దేవరపై డిస్కషన్.. రీజన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో థియేట్రికల్ రిలీజై ఎన్టీఆర్ మాస్ స్టామినా వల్ల పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా.

By:  Ramesh Boddu   |   13 Oct 2025 10:16 AM IST
దేవరపై డిస్కషన్.. రీజన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో థియేట్రికల్ రిలీజై ఎన్టీఆర్ మాస్ స్టామినా వల్ల పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా. ఐతే దేవర 1 పూర్తైంది.. దేవర 2 ఉంటుందా లేదా అన్న అనుమానాలు నిన్న మొన్నటిదాకా ఉన్నాయి. కొరటాల శివ మాత్రం దేవర 2 మీద మరింత వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. కచ్చితంగా దేవర 2 ఉంటుంది. కానీ అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పడం కష్టమవుతుంది. దేవర 1 సినిమా థియేట్రికల్, డిజిటల్ రిలీజైంది కానీ శాటిలైట్ రిలీజ్ అదే స్మాల్ స్క్రీన్ పై ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

స్టార్ సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్..

దేవర 1 సినిమాను శాటిలైట్ రైట్స్ ఎవరు కొనలేఅన్న టాక్ నడుస్తుంది. సినిమా రిలీజై ఏడాది అవుతున్నా శాటిలైట్ రైట్స్ సేల్ అవ్వకపోవడం పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. స్టార్ సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ సెట్ చేసుకుంటారు. ఐతే దేవర 1 విషయంలో అది కాస్త లేట్ అవుతూ వచ్చింది. ఈమధ్య స్మాల్ స్క్రీన్ పై కూడా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా 3 లేదా 6 నెలల్లో వరల్డ్ టీవీ ప్రీమియర్స్ గా వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు దేవర 1 సినిమా స్మాల్ స్క్రీన్ పై రిలీజ్ కాలేదు.

ఫైనల్ గా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జియో హాట్ స్టార్ తీసుకున్నారట. అంటే స్టార్ గ్రూప్స్ ఈ సినిమాను బుల్లితెర మీద స్ట్రీమింగ్ చేస్తరు. స్టార్ మా తెలుగు, స్టార్ గోల్డ్ హిందీ, విజయ్ తమిళ్ ఇలా స్టార్ గ్రూప్ ఛానెల్స్ లో ఏదైనా ఫెస్టివల్ మూమెంట్ చూసి స్మాల్ స్క్రీన్ పై స్ట్రీమింగ్ చేస్తారు. ఐతే అక్టోబర్ 26న హిందీ ప్రీమియర్స్ పడుతున్నాయి. అక్కడ స్టార్ గోల్డ్ హిందీలో దేవర 1 స్ట్రీమింగ్ అవుతుంది.

దేవర 1 ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినా..

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన రెండో సినిమా దేవర. దేవర 1 ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినా సాలిడ్ అనిపించలేదు. అందుకే పార్ట్ 2 ని అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. ఈమధ్య కాలంలో థియేట్రికల్ రిలీజైన వన్ ఇయర్ తర్వాత స్మాల్ స్క్రీన్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాగా దేవర స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. రీజన్స్ ఏవైనా ఇన్నాళ్లకు దేవర 1ని టీవీల్లో చూసే ఛాన్స్ ఆడియన్స్ కి దక్కింది. ఐతే దేవర 1 తెలుగు స్మాల్ స్క్రీన్ స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఇంకా డిసైడ్ చేయలేదు.