Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ ని వెన్నంటుతున్న సీఎం !

జూనియర్ ఎన్టీఆర్ ఈ తరంలో అద్భుతమైన నటుడు. ఆ విషయంలో రెండవ మాట అవసరం లేదు.

By:  Satya P   |   1 Oct 2026 4:00 AM IST
జూనియర్ ఎన్టీఆర్ ని వెన్నంటుతున్న సీఎం  !
X

జూనియర్ ఎన్టీఆర్ ఈ తరంలో అద్భుతమైన నటుడు. ఆ విషయంలో రెండవ మాట అవసరం లేదు. అత్యంత ప్రతిభా పాటవాలను వెండి తెర నిండుగా ఆవిష్కరించగల సత్తా ఉన్న అతి కొద్ది మందిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకుని నటనను కొనసాగిస్తున్నారు. పదిహేడేళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ కి రెండవ సినిమా స్టూడెంట్ నంబర్ వన్ బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ రోజున సెట్స్ మీద ఉన్న డ్రాగన్ వరకూ జూనియర్ చేస్తున్న చేసిన ఎన్నో పాత్రలు నటనలో ఆయన ఏమిటన్నది చక్కగా తెలియచేస్తాయి. ఇక చూస్తే జూనియర్ వయసు ప్రస్తుతం 43 ఏళ్ళు మాత్రమే.

చాలా కాలానికి :

ఇదిలా ఉంటే చాలా కాలానికి ఒక బహిరంగ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ హాజరై అభిమానులను విశేషంగా అలరించారు. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ మెరిసారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన పదహారు నిముషాల స్పీచ్ అయితే అక్కడ ఉన్న వారినే కాదు సోషల్ మీడియా ద్వారా చూస్తున్న వారికి కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూనియర్ స్పీచ్ లో ఎక్కడా తడబడకుండా తాను చెప్పాల్సిన విషయం చెబుతూ తన అభిమానుల గురించి తన ఎమోషన్స్ గురించి కూడా విప్పి చెప్పారు

ఆద్యంతం నినాదాలు :

అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగిస్తున్నంతసేపూ ఆద్యంతం ఆయన అభిమానులు అయితే ఒక్కటే స్లోగన్ చేస్తూ వచ్చారు. సీఎం అంటూ సభలో సందడి చేశారు. ఈ నినాదాలు ఒక వైపు వినిపిస్తున్నప్పటికీ జూనియర్ ఎక్కడా తొణకలేదు, తొట్రుపాటుకు గురి కాలేదు, ఆయన తాను ఏమని చెప్పదలచుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కడా డీవీయేట్ కాకుండా తన స్పీచ్ ని కొనసాగించి తన స్థిత ప్రజ్ఞతను చాటుకున్నారు. ఒక విధంగా చూస్తే దటీజ్ ఎన్టీఆర్ అనిపించారు. ఆయనలో మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత హైలో ఉన్నాయో కూడా ఈ ఉదంతం మరోసారి నిరూపించినట్లు అయింది.

సీఎం మెటీరియల్ గానే :

జూనియర్ మంచి వయసులో ఉన్నారు, సినీ హీరోగా ఎంతో కెరీర్ ఉంది. చిన్న వయసులోనే హీరో అయిన ఆయన అపుడే పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేశారు. మారో పాతికేళ్ల పాటు అంతే దూకుడుగా తన హవా చాటుకునే సత్తా కలిగి ఉన్నారు. ఆయన సినిమాల కమిట్మెంట్ చూస్తే వరసగా ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాంటి జూనియర్ ని సీఎం అని అభిమానులు ఇప్పటి నుంచే ఎంతగా పిలిచినా ఆయన అందుకే చలించడం లేదని అంటున్నారు. అంతే కాదు తన స్పందన కూడా దాని మీద తెలియజేయకుండా పరిణతి చూపిస్తున్నారు అని అంటున్నారు.

లౌక్యంగానే ఉంటూ :

ఆ మధ్య ఒక సభలో యాంకర్ ఎవరో మరో పాతికేళ్ల తరువాత జూనియర్ ని ఎలా చూడొచ్చు అని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. దానికి స్పాంటేనియస్ గా జూనియర్ ఇచ్చిన ఆన్సర్ యాంకర్ నే కాదు అందరికీ సర్ప్రైజ్ చేసింది. అప్పటికి 67 ఏళ్ళ వయసులో జూనియర్ ఉంటాడు అని బదులిచ్చి ఆ ప్రశ్నను అలా ముగించారు. నిజానికి యాంకర్ అడిగిన ఉద్దేశ్యం వేరు అన్నది అందరికీ తెలిసిందే జూనియర్ పాలిటిక్స్ లోకి వచ్చి కీలక పదవిలో ఆనాటికి ఉంటాడని ఊహిస్తూ ఊహాజనితమైన ప్రశ్నగా దీనిని సంధించారు. కానీ జూనియర్ అంతే తెలివిగా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చి తన ప్రస్తుత లక్ష్యం ఏమిటో స్పష్టం చేశారు అని అంటున్నారు. ఇపుడు కూడా ఎంతో మంది అభిమానులు ఆయన్ని సీఎం గా భావించి నినాదాలు చేసినా జూనియర్ రియాక్షన్ మామూలుగానే ఉంటోంది. అయితే జూనియర్ మాత్రం సీఎం మెటీరియల్ అనడంలో సందేహం లేదు. కానీ మరి అదెపుడు ఎలా అంటే దానికి జవాబు కాలమే చెబుతుంది.