Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్.. రెమ్యూనరేషన్ తో పాటు ఆస్తులు, కార్ కలెక్షన్ వైరల్!

ఇక 2001లో నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సింహాద్రి, ఆది ఇలా పలు చిత్రాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

By:  Madhu Reddy   |   20 May 2026 10:50 AM IST
ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్.. రెమ్యూనరేషన్ తో పాటు ఆస్తులు, కార్ కలెక్షన్ వైరల్!
X

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. 1991లో ఎన్టీ రామారావు రచన, దర్శకత్వంలో వచ్చిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రం ద్వారా బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. 1997లో బాల రామాయణం సినిమాలో రాముడి పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పరిష్కారాన్ని కూడా సొంతం చేసుకుంది . గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎన్టీఆర్ కి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు లభించింది.

ఇక 2001లో నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సింహాద్రి, ఆది ఇలా పలు చిత్రాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. దేవరా సినిమాతో మరింత క్రేజ్ దక్కించుకున్నారు. మాస్ హీరోగా, యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన రెమ్యూనరేషన్ , ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1983 మే 20న స్వర్గీయ నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించిన ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన మొదటి పారితోషకాన్ని తన తల్లికి ఇచ్చినట్లు తెలిపారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో పలు రంగాలలో పెట్టుబడులు పెట్టిన ఈయన.. అటు సినిమా రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో వాటాను కూడా తీసుకుంటున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనల కోసం భారీ మొత్తాన్ని తీసుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పటివరకు సుమారుగా రూ.600 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం.

ఇక ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయానికొస్తే.. జూబ్లీహిల్స్ లో రూ.50 కోట్ల విలువైన ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అలాగే బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలలో కూడా ఇల్లు కొనుగోలు చేశారు. ఇక మరో ఫామ్ హౌస్ కూడా ఉంది. అంతేకాదు సుమారుగా రూ.80 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు హీరోలలో ఇలాంటి లగ్జరీ జెట్ కలిగిన స్టార్ హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉండగా.. అలాంటి వారిలో ఎన్టీఆర్ కూడా చేరిపోయారు..

ఎన్టీఆర్ దగ్గర ఉండే కార్ కలెక్షన్ విషయానికి వస్తే.. రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ తో పాటు కోటిన్నర విలువైన మరో బ్రాండెడ్ లగ్జరీ కారు ఈయన కార్ గ్యారేజ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు రూ.1కోటి 20 లక్షల విలువైన బెంజ్ 4మెటిక్ కారు కూడా ఉంది.. ఇకపోతే ఎక్కువగా రేంజ్ రోవర్ కార్ లోనే ప్రయాణం చేసే ఈయన.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లను కూడా కలిగి ఉన్నారు.

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ ముందు వరకు రూ.50 నుండి రూ.60 వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా సినిమాలలో వచ్చే లాభాలలో వాటాలు కూడా తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా బ్లడ్ బాత్ రేంజ్ లో గ్లింప్స్ అదరగొట్టేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.