Begin typing your search above and press return to search.

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా 2028లో పట్టాలెక్కనుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తారక్‌తో అనిల్ ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారన్న ఆసక్తి మొదలైంది. ఈ ప్రాజెక్ట్ తెలుగు ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న రీజనల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందా? లేక పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుందా? అన్న చర్చ నడుస్తోంది.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 12:26 AM IST
అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. అది ఇప్ప‌టికిప్పుడు మొద‌ల‌వ్వ‌క‌పోయినా? రెండేళ్ల త‌ర్వాతైనా కాంబో ప‌ట్టాలెక్క‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైర‌ల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ 2028లోనే పట్టాలెక్కనుందని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. తారక్ లాంటి గ్లోబల్ స్టార్‌తో అనిల్ రావిపూడి చేయబోయే ప్రయోగం ఏ రేంజ్‌లో ఉంటుంది? ఇది రీజనల్ మార్కెట్ పరిధికి మాత్రమే పరిమితమవుతుందా ?లేక పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందా? అనే కోణంలో విశ్లేషణలు ఊపందుకున్నాయి.

అనిల్ రావిపూడి సినిమాలంటే వినోదం.. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు.. కమర్షియల్ హంగులతో కూడిన పక్కా లోకల్ మాస్ ఫార్మాట్. `పటాస్` నుంచి రీసెంట్ చిత్రాల వరకు అనీల్ మేకింగ్ స్టైల్ ఎప్పుడూ తెలుగు నేటివిటీకి దగ్గరగానే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లతో పూర్తిగా గ్లోబల్ అండ్ పాన్ ఇండియా రేంజ్‌లోకి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తారక్ సినిమా చేయడం అంటే? కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అనిల్ రావిపూడి తన శైలిని పూర్తిగా మార్చుకుని నేషనల్ ఆడియన్స్‌కు నచ్చేలా కథను సిద్ధం చేస్తారా? లేక తనదైన తెలుగు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మరోసారి రీజనల్ బాక్సాఫీస్‌ను షాక్ ఇస్తారా? అనేది చూడాలి.

ప్రస్తుత ట్రెండ్‌లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా ? అది కనీసం పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తారక్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కావడం కష్టమే. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, కొరటాల శివ వంటి దర్శకులతో భారీ యాక్షన్ డ్రామాలు చేసిన ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ అవుతూ పూర్తిగా నవ్వులు పంచే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌ను అనిల్ రావిపూడితో చేయాలని భావించే అవ‌కాశం లేక‌పోలేదు. ఇదే నిజమైతే సినిమాను కేవలం రీజనల్ బౌండరీస్‌లోనే ఉంచి తెలుగు ప్రేక్షకుల నూటికి నూరు శాతం అలరించేలా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది

అదే సమయంలో అనిల్ రావిపూడి కూడా కెరీర్‌లో తొలిసారి గ్లోబల్ స్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో తన మార్కును మరింత విస్తృతం చేసే ప్రయత్నం చేయోచ్చు. కామెడీ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను జోడించి దీన్ని ఒక రేంజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మలిచే ఛాన్స్ ఉంది. 2028 నాటికి టాలీవుడ్ మార్కెట్ పరిధులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. దర్శకుడిగా అనిల్ రావిపూడికి.. హీరోగా తారకు ఈ ఈ సినిమా చాలా కీలకమైన ప్రయోగమే అవుతుంది.

ప్రయోగాలు చేయడంలో ముందుండే ఎన్టీఆర్.. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి చేతిలో పడితే బాక్సాఫీస్ వద్ద నవ్వులు.. వసూళ్ల వర్షం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. ఇది రీజనల్ మార్కెట్ పరిధిలో ఉంటుందా? లేక పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు తిరగరాస్తుందా? అనేది తెలియాలంటే 2028 వరకు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ కాంబినేష‌న్ మాత్రం ఇప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.