ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...
'దేవర'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్'తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్'కు సిద్ధమవుతున్నాడు. ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఇటీవల తారక్‌కు అనిల్ కథ వినిపించగా నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చే పనిలో రచనా బృందం ఉన్నట్లు టాక్.
By: Gopi Velupala | 16 Nov 2026 1:56 AM ISTపాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడం అంత సులువు కాదు. కానీ మన స్టార్ హీరోలు చాలా సింపుల్ గా విజయాలను అందుకుంటున్నారు. అందుకే మన హీరోలతో సినిమాలు చేయడానికి చాలా మంది ఇతర భాషల దర్శకులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కానీ మన హీరోలు మాత్రం మన దర్శకులకే ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారు...జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారాడు. 'దేవర' మూవీతో 600 కోట్లు కొల్లగొట్టిన ఆయన ఇపుడు 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ తో 'గాడ్ ఆఫ్ వార్' సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి తో సినిమా ఉంటుందని తారక్ స్పష్టం చేశాడు.
అనిల్ రావిపూడి - ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడు...
గతంలో వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ మూవీ పట్టలెక్కలేదు. దాంతో చాలా రోజుల నుంచి వీళ్ళ మూవీ మీద వార్తలు వస్తున్నప్పటికి అవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవాలు కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఎట్టకేలకు వీళ్ళిద్దరి కాంబో సెట్ అయినట్టుగా ఎన్టీఆర్ ఫోటో అప్లోడ్ చేసి అధికారికంగా ప్రకటించడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ప్రధానంగా సాగుతుంటుంది. దానికి తోడు ఆయన మూవీలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తుంటాడు. చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ కామెడీ టచ్ ఉన్న సినిమా చేయాలని చూస్తున్నాడు. 'అదుర్స్' లో ఆయన చేసిన 'చారి' పాత్రకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఆ రేంజ్ లో మరోసారి కామెడీ చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు.
దానికి తోడు త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ మరో సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో ఒక లైట్ వెయిట్ ఉన్న కథతో సినిమా చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. ప్రస్తుతం అలాంటి సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ గా నిలుపగలిగే దర్శకుడు అనిల్ ఒక్కడే కాబట్టి ఆయనతో సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.
అనిల్ సంవత్సరం లో పూర్తి చేస్తాడా?
అనిల్ కి సంక్రాంతి బాగా కలిసి వచ్చింది. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర్ వర ప్రసాద్ సినిమాలతో హిట్స్ అందుకొని సంక్రాంతి దర్శకుడిగా పేరు తెచ్చుకన్నాడు. అనిల్ ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కేవలం సంవత్సరంలో సినిమాను చేసి రిలీజ్ చేస్తుంటాడు. మరి తారక్ విషయంలో అది సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి తారక్ తో చేయబోయే సినిమా స్టోరీ వర్క్ జరుగుతుందట. తను జనవరి 12 విడుదల మూవీ బిజీలో ఉన్నప్పటికి తన రైటింగ్ టీమ్ తారక్ మూవీ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా తారక్ ను కలిసిన అనిల్ తన దగ్గర ఉన్న కథను నేరేట్ చేశాడట. అది ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. దానిని ఫుల్ లెంత్ కథ గా మార్చే ప్రయత్నంలో అనిల్ అండ్ టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది...
