ఈ రెండు సినిమాల సీక్వెల్స్ లో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందా?
మాస్ యాక్షన్ సినిమాల్లో అలరించిన ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాతో భిన్న వైఖరిని పాటించాడు.
By: Gopi Velupala | 18 Oct 2026 12:00 PM ISTప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గ్లోబల్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీఆర్ మాస్ కమర్షియల్ సినిమాలపైనే దృష్టి పెట్టారు. టైర్ వన్ హీరోలందరిలో తను కూడా ఒకరిగా కొనసాగుతుండటం విశేషం... 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆయన దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుకున్నాడు. 600 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన మూవీగా నిలిచింది... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'డ్రాగన్' సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందంటూ సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తన నుంచి ఒక రెండు సినిమాలకు సీక్వెల్స్ వస్తే చూడడానికి రెడీగా ఉన్నారు... ఆ మూవీస్ ఏంటంటే...
అదుర్స్
'వివి వినాయక్' దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన 'అదుర్స్' సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. రెండు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా చారి పాత్రలో అతని నటనకి ప్రశంశలు దక్కాయి. సినిమా యూనిట్ ఈ మూవీ కి సీక్వెల్ ఉందంటూ చాలా రోజులుగా ప్రచారం చేస్తున్నారు. కానీ అది కార్యరూపమైతే దాల్చడం లేదు. ఈ సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంకాస్త టైమ్ తీసుకునేలా కనిపిస్తున్నాడు. గతంలో అదుర్స్ సినిమా రైటర్ కోన వెంకట్ సైతం ఈ మూవీకి సీక్వెల్ స్టోరీ రాస్తానని చెప్పాడు. దానికి ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని చెప్పడం విశేషం... వివి వినాయక్ ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాడు. మరోసారి ఆయన మెగా ఫోన్ పట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి అదుర్స్ కి సీక్వెల్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు...
నాన్నకు ప్రేమతో
మాస్ యాక్షన్ సినిమాల్లో అలరించిన ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాతో భిన్న వైఖరిని పాటించాడు. ఈ సినిమా చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ లోని ఒక కొత్త నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు రిపీటెడ్ గా చూస్తుంటే సినిమాకి చాలా బాగా అడిక్ట్ అవుతున్నట్టుగా చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 'నాన్నకు ప్రేమతో' సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని మరోసారి ఎన్టీఆర్ ను ఆ లుక్ లో చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు... ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వరుస లైనప్ లతో బిజీగా ఉన్నాడు. కాబట్టి నాన్నకు ప్రేమతో సినిమాకి సీక్వెల్ అనేది చాలా కష్టమనే చెప్పాలి. కానీ ఫీచర్లో వస్తే మాత్రం దానికి చాలా మంచి క్రేజ్ దక్కుతుంది..
ఈ రెండు సినిమాల సీక్వెల్స్ లో ఎన్టీఆర్ నటిస్తే తన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు సూపర్ హిట్ సినిమాలే కాబట్టి వీటిని ప్రేక్షకులు మరోసారి ఆదరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు...
