84కోట్లతో ఇల్లు కొన్నాడు.. సైలెంట్‌గా ఆస్తులు పెంచుకుంటున్న స్టార్ హీరో!
ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది.
By: Sivaji Kontham | 21 July 2026 12:57 AM ISTకండల వీరుడు జాన్ అబ్రహాం బాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోగా తన హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అతడి ఎంపికలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఎగ్జయిట్ చేస్తున్నాయి. ఇక జాన్ అబ్రహాం సినిమాల పారితోషికాల పరంగానే కాకుండా.. రకరకాల మార్గాలలో సంపాదిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడు తన సంపదల విలువను అపారంగా పెంచుకుంటున్నారు.
ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ జాన్ అబ్రహం రూ. 84 కోట్లతో ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. సెంట్ మార్టిన్ రోడ్‌లో ఉన్న ఈ లగ్జరీ ఫ్రీహోల్డ్ ప్రాపర్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయినట్లు రియల్ ఎస్టేట్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి కాగా.. జాన్ చేసిన ఈ భారీ ఇన్వెస్టిమెంట్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ కెరీర్ విషయానికొస్తే... ఇటీవల'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించిన జాన్ అబ్రహం, త్వరలోనే రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో అతడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
దీంతో పాటు తన కెరీర్‌లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో మళ్లీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ యశ్‌వర్ధన్ సింగ్ పాత్రలో మెరవనున్నారు. ఒకవైపు భారీ రియల్ ఎస్టేట్ డీల్స్, మరోవైపు క్రేజీ లైనప్ సినిమాలతో జాన్ అబ్రహం వార్తల్లో నిలుస్తున్నారు.
