MCU 'ఘోస్ట్ రైడర్'గా క్రేజీ హీరో ఆరంగేట్రం?
గత కొన్ని రోజులుగా మార్వెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా డిబేట్ ఉత్కంఠగా మారింది.
By: Sivaji Kontham | 13 Jan 2026 8:30 AM ISTగత కొన్ని రోజులుగా మార్వెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా డిబేట్ ఉత్కంఠగా మారింది. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జో కీరీ, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు)లోకి ఘోస్ట్ రైడర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ వార్త సారాంశం. పూర్తి వివరాల్లోకి వెళితే...
`స్ట్రేంజర్ థింగ్స్`లో తనదైన యూనిక్ హెయిర్ స్టైల్, నటనతో (స్టీవ్ హారింగ్టన్ పాత్ర) అందరినీ ఆకట్టుకున్నారు జో కీరీ. నెటిజన్లు అతడిని డాని కేచ్ వెర్షన్ ఘోస్ట్ రైడర్‌గా ఊహించుకుంటూ కొన్ని `ఫ్యాన్ ఆర్ట్` ఫోటోలను రూపొందించారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో మార్వెల్ నిజంగానే ఆయనను సంప్రదించిందనే రూమర్లు పుట్టాయి.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్ల గురించి నటుడు జో కీరీని ప్రశ్నించగా, ఆయన చాలా సరదాగా స్పందించారు. నేను కూడా ఆ వార్తలను చూశాను. కానీ ప్రస్తుతానికి అవేవీ నిజం కావు. అయితే మార్వెల్ సినిమాల్లో నటించడం ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను! అని ఆయన పేర్కొన్నారు.
ఘోస్ట్ రైడర్ పాత్ర కోసం జో కీరీ పేరు వినిపిస్తున్నప్పటికీ, రేసులో మరికొంతమంది దిగ్గజ నటులు ఉన్నారు. ర్యాన్ గోస్లింగ్ ఈ పాత్రపై బహిరంగంగానే తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే మంచి బైకర్ గా పేరున్న నార్మన్ రీడస్ మెజారిటీ అభిమానులకు మొదటి ఛాయిస్ అవుతారు. ఘోస్ట్ రైడర్‌గా కీను రీవ్స్ ని చూడాలని మిలియన్ల మంది అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
మార్వెల్ స్టూడియోస్ ఇప్పటివరకు అధికారికంగా `ఘోస్ట్ రైడర్` సినిమాను ప్రకటించలేదు. కానీ `డాక్టర్ స్ట్రేంజ్ 2` తర్వాత మల్టీవర్స్ కథలు పెరగడంతో, ఘోస్ట్ రైడర్ వంటి సూపర్ నేచురల్ క్యారెక్టర్లు త్వరలోనే స్క్రీన్ మీద కనిపిస్తారని టాక్.
