ప్రియాంక చోప్రా బావ గారు ఎందుకంత ఎమోషనల్?
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 27 Oct 2025 9:31 AM ISTగ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రియాంక చోప్రా స్టంట్స్ కూడా చేస్తుందని గుసగుస వినిపించింది.
ఇక ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే. భారతీయ సాంప్రదాయం, సత్సంబంధాల గొప్పతనాన్ని జోనాస్ ఫ్యామిలీకి పరిచయం చేసింది పీసీ. జోనాస్ కుటుంబం ప్రియాంక చోప్రా సాంప్రదాయం ది బెస్ట్ అని కితాబిచ్చింది.
అయితే ఇదే ఫ్యామిలీలో ప్రియాంక చోప్రా బావగారు, నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ భార్యతో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జో జోనాస్ ప్రముఖ పాప్ గాయని సోఫీ టర్నర్ నుంచి విడిపోతున్నట్టు ఏడాది క్రితం ప్రకటించాడు. ఈ జంట విడాకుల ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఆ సమయంలో అతడు మానసికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే తన సోదరులు నిక్ జోనాస్, కెవిన్ జోనాస్ సహా కుటుంబం తనకు అండగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసాడు. తన పిల్లలు - విల్లా (5) మరియు డెల్ఫిన్ (3) లకు తన మాజీ భార్యతో కలిసి సహపోషకుడిగా ఉంటానని జోజోనాస్ మాట్లాడారు. జోనాస్ బ్రదర్స్ లో నిక్ జోనాస్ అందరి కంటే చివరివాడు అన్న సంగతి తెలిసిందే.
విడాకులపై జో జోనాస్ తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ``విడాకులు ఏ జంటకు అయినా కష్టం. ఇది ఎవరికీ సులభం కాదు. ప్రజలు చాలా త్వరగా ఊహాగానాలు సాగిస్తారు. కానీ నాకు నా అద్భుతమైన కుటుంబం.. స్నేహితులు ఉన్నందుకు కృతజ్ఞుడను`` అని భావోద్వేగానికి గురయ్యాడు. కష్టంలో ఉన్న ప్రజలకు తన గానం, సంగీతంతో అన్నిటినీ మరిచిపోయేలా చేసాను.. అది నా వృత్తి. విడాకులు సహా ఎలాంటి కష్టం నుంచి అయినా ప్రజల్ని సంగీతం బయటపడేయగలదు. విడాకుల కష్టం నుండి వారిని దృష్టి మరల్చగలగడం.. అది నాకు చాలా ప్రయోజనాన్ని ఇచ్చింది అని చెప్పాడు. తన పిల్లల కోసం ఏదైనా చేస్తానని గాయకుడు జో జోనాస్ వెల్లడించాడు. తన మాజీ భార్య సోఫీతో కూడా సత్సంబంధాన్ని కొనసాగిస్తానని అన్నాడు. రెండు సంవత్సరాల కాలంలో నేను దాని నుండి బయటపడగలను అని కూడా అన్నాడు.
జో జోనాస్ - సోఫీ టర్నర్ 4 సంవత్సరాల సంసారం అనంతరం విడాకులు తీసుకున్నారు. సెప్టెంబర్ 2023లో జో -సోఫీ మయామిలో విడాకుల కోసం దాఖలు చేశారు. తరువాత ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
సోఫీ టర్నర్ ప్రస్తుతం బ్రిటిష్ మోడల్ పెరెగ్రైన్ పియర్సన్‌తో సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. జో జోనాస్ నుండి విడిపోయిన కొద్దికాలానికే అక్టోబర్ 2023లో ఈ జంట మొదటిసారి పారిస్, లండన్‌లో కలిసి కనిపించారు. అప్పటి నుండి తమ రిలేషన్‌షిప్ విషయంలో బహిరంగంగానే ఉన్నారు.
