డైమండ్ కోసం వేట.. మనోభావాల బ్యాచ్‌కు వార్నింగ్!
మేకర్స్ రిలీజ్ చేసిన 'జో జో' పోస్టర్‌ను చూస్తే సినిమా ఎంత రా విజువల్స్ తో పల్లెటూరి వాతావరణంలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
By: M Prashanth | 14 Aug 2026 10:17 PM ISTజొన్నగిరిలోని డ్రై డైమండ్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కొత్త కథ సెట్స్‌పైకి వచ్చింది. జేబులో చిల్లిగవ్వ లేని ఇద్దరు కుర్రాళ్లు, భయం లేని ఒక డేరింగ్ యువతి కలిసి తమ రాతను మార్చేసే ఒక వజ్రం కోసం వెతకడం ఈ సినిమా మెయిన్ పాయింట్. ఆ ఒక్క డైమండ్ దొరికితే తమ లైఫ్ ఒక్కసారిగా సెటిల్ అయిపోతుందనే ఆశతో వాళ్లు చేసే ట్రెజర్ హంట్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది.
అయితే వాళ్లు అనుకున్నట్లుగా ఆ డైమండ్ దొరికే ప్రాసెస్ అంత ఈజీగా సాగదు. ఈ ముగ్గురి వేట మధ్యలోకి అనుకోకుండా రొమాన్స్, కామెడీ మిస్ అడ్వెంచర్స్ వచ్చి పడతాయి. దాంతో పాటు అత్యాశ, మోసం, ప్రమాదాలు కూడా ఈ కథలో భాగం అవుతాయి. ఊహించని మలుపులు తిరిగే ఈ డైమండ్ హంట్ ను లోకల్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక రస్టిక్ రొమాంటిక్ కామెడీగా తీస్తున్నారు. దీనికి 'జో జో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
మేకర్స్ రిలీజ్ చేసిన 'జో జో' పోస్టర్‌ను చూస్తే సినిమా ఎంత రా విజువల్స్ తో పల్లెటూరి వాతావరణంలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పోస్టర్ మీద “హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!” అని ఒక క్యాప్షన్ వేశారు. ఈ వార్నింగ్ చూస్తుంటే ఈ కథలోని రొమాన్స్, కామెడీ టచ్ ఫుల్ మాస్ యాంగిల్‌లో, కాస్త అన్‌ఫిల్టర్డ్ గా జనాలకు రీచ్ అయ్యేలా సాగుతుందని ఇట్టే తెలిసిపోతుంది.
ఈ రస్టిక్ విలేజ్ కామెడీని సమర్పిస్తోంది మరెవరో కాదు, డైరెక్టర్ దేవా కట్టా. సాధారణంగా ఆయన సినిమాలంటే చాలా సీరియస్ ఐడియాలజీ, ఇంటెన్స్ డ్రామా ఫీల్ ఉంటాయి. కానీ తన రెగ్యులర్ బ్రాండ్ కు కంప్లీట్ ఆపోజిట్ గా ఉండే ఒక అన్‌ఫిల్టర్డ్ డ్రామాకి బ్యాకప్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. తన కంఫర్ట్ జోన్ కు భిన్నమైన వాతావరణంలో సాగే కథను ఆయన ప్రెజెంట్ చేస్తుండటం ఇక్కడ హైలైట్.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక చిన్న కనెక్షన్ ఉంది. గతంలో వచ్చిన 'మాయసభ' అనే డ్రామా కోసం దేవా కట్టా, డైరెక్టర్ కిరణ్ జయ్ కుమార్, ప్రొడ్యూసర్ విజయ్ కృష్ణ లింగమనేని కలిసి పని చేశారు. అప్పుడు ఒక సీరియస్ కథను డీల్ చేసిన ఈ ముగ్గురూ, ఇప్పుడు విజయమ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ కొత్త జానర్ మూవీ కోసం మళ్లీ ఒక్కటయ్యారు.
కిరణ్ జయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మాహీ శ్రీ హీరో హీరోయిన్లుగా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు మకరంద్ దేశ్‌పాండే ముఖేష్ షా పాత్ర చేస్తున్నాడు. ఫణీంద్ర, ప్రభావతి, మహబూబ్ బాషా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మహేష్ శంకర్ మ్యూజిక్, రోహిత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ డైమండ్ హంట్ కు సంబంధించిన రిలీజ్ డీటైల్స్ త్వరలో రానున్నాయి.
