బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?
హిందీ బిగ్ బాస్ బ్యూటీ జియా శంకర్ లేటెస్ట్ ఇన్‌స్టా రీల్ నెట్టింట చర్చనీయాంశమైంది. వైట్ ఫ్లోరల్ డ్రెస్‌లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, బిగ్ షాన్ బోల్డ్ ర్యాప్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించింది. ‘Just a gentle reminder’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ రీల్ ఎవరికైనా పరోక్షంగా కౌంటర్ ఇచ్చేందుకేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
By: M Prashanth | 17 Nov 2026 4:02 PM ISTసోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, రీల్స్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకోవడం సెలబ్రిటీలకు అలవాటే. అయితే హిందీ బిగ్ బాస్ బ్యూటీ జియా శంకర్ షేర్ చేసిన లేటెస్ట్ ఇన్‌స్టా రీల్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చూడటానికి చాలా సాఫ్ట్ గా, క్యూట్ గా కనిపిస్తూనే బ్యాక్ గ్రౌండ్ లో బూతు పదాలతో కూడిన బోల్డ్ ఇంగ్లిష్ ర్యాప్ సాంగ్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా దానికి తగ్గట్టుగా ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా హైలెట్ అయ్యింది.
ఈ వీడియోలో జియా వైట్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ లో సింపుల్ గా రెడీ అయ్యారు. లైట్ మేకప్, బ్రౌన్ కర్లీ హెయిర్ తో ఇంట్లోనే క్యాజువల్ గా ఈ రీల్ షూట్ చేశారు. కెమెరా ముందు నవ్వుతూ, చేతులతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో అమెరికన్ ర్యాపర్ బిగ్ షాన్ పాడిన 'I Don't F** With You' పాటను యాడ్ చేశారు. ఎదుటి వాళ్లను అసలు పట్టించుకోననే అర్థం వచ్చేలా ఉండే ఈ పాటకు, 'Just a gentle reminder' అంటూ క్యాప్షన్ పెట్టడం మరో హైలెట్.
జియా ఎక్స్ ప్రెషన్స్ కు, ఆ పాటలోని అభ్యంతరకర లిరిక్స్ కు అస్సలు సంబంధం లేకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరికో ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ వేయడానికే ఆమె ఈ రీల్ పోస్ట్ చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫాలోవర్స్ మాత్రం ఆమె క్యూట్ లుక్స్ ను పొగుడుతూ రిప్లై ఇస్తున్నారు.
నిజానికి జియా శంకర్ కు టాలీవుడ్ తో మంచి కనెక్షన్ ఉంది. కెరీర్ ప్రారంభంలో 'ఎంత అందంగా ఉన్నావే', 'హైదరాబాద్ లవ్ స్టోరీ' లాంటి తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా ఇక్కడ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో ముంబై షిఫ్ట్ అయి హిందీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. అక్కడ 'మేరీ హానికారక్ బీవీ', 'పిషాచిని' లాంటి సీరియల్స్ తో పాటు రితేశ్ దేశ్ ముఖ్ నటించిన 'వేద్' సినిమాతో జియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ OTT రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ట్రెండింగ్ కంటెంట్ తో సందడి చేస్తున్నారు. లేటెస్ట్ రీల్ విషయంలో మాత్రం జియా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ట్రెండింగ్ ఆడియో కోసమే చేశారా, లేక నిజంగానే ఎవరికైనా స్వీట్ వార్నింగ్ ఇచ్చారా అన్నది సస్పెన్స్ గానే ఉంది. ఏదేమైనా క్యూట్ లుక్ లో బోల్డ్ యాటిట్యూడ్ చూపిస్తూ జియా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.
