Begin typing your search above and press return to search.

లాంగ్ డిస్టెన్స్ లవ్‌కు హ్యాపీ ఎండింగ్.. జియా శంకర్ ఎంగేజ్‌మెంట్!

ఈ ప్రత్యేకమైన వేడుకకు సంబంధించిన రోమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ వారి సుదీర్ఘ లాంగ్-డిస్టెన్స్ లవ్ స్టోరీ గురించి ఒక ఎమోష‌న‌ల్ నోట్‌ను షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   6 Aug 2026 4:38 PM IST
లాంగ్ డిస్టెన్స్ లవ్‌కు హ్యాపీ ఎండింగ్.. జియా శంకర్ ఎంగేజ్‌మెంట్!
X

ప్రముఖ టీవీ మూవీ న‌టి, `బిగ్ బాస్ OTT 2` ఫేమ్ జియా శంకర్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 6న సోషల్ మీడియా వేదికగా ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త, కార్పొరేట్ ప్రొఫెషనల్ అయిన కరణ్ ధనక్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు సంబంధించిన రోమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ వారి సుదీర్ఘ లాంగ్-డిస్టెన్స్ లవ్ స్టోరీ గురించి ఒక ఎమోష‌న‌ల్ నోట్‌ను షేర్ చేసారు.

ఈ ఆనందకరమైన వార్తను ప్రకటిస్తూ.. మనం అస్సలు ఊహించని సమయంలోనే ప్రేమ లభిస్తుందనేది నిజమేనని జియా గుర్తుచేసుకున్నారు. దేవుడు తన ఓర్పును పరీక్షించినా.. వేలాది మైళ్ల దూరంలో ఉన్నా కరణ్‌తో మాట్లాడిన ప్రతిసారీ అది తన సొంత ఇంటి వాతావరణంలా అనిపించేదని పేర్కొన్నారు. దూర భారంతో ఈ ప్రయాణం తేలికగా సాగకపోయినా.. ప్రతీ రోజూ ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నామని వివరించారు.

తన కష్ట సమయాల్లో కరణ్ నవ్వించాడని... విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పే ప్రతిసారి గుండె పగిలిపోయేలా తన‌ను హత్తుకునేవాడని జియా రాసుకొచ్చారు. కరణ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్, గూఫ్‌బాల్ అని సంబోధిస్తూ తన జీవితం అతడితో ఒక అడ్వెంచర్ .. ఇష్టమైన రోమ్-కామ్ మూవీలా మారిందని అన్నారు. తన జీవితాంతం అతడితో గడపడానికి,.. అత‌డిని ప్రేమిస్తూ ఉండటానికి వేచి చూడలేకపోతున్నానని పోస్ట్‌లో తెలిపారు. నిశ్చితార్థ వేడుక ఫోటోలలో ఈ జంట పాస్టెల్ దుస్తులలో పరస్పరం చేతులు పట్టుకుని ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూ కెమెరాలకు ఫోజులిచ్చారు.

ఎవరీ కరణ్ ధనక్?

కరణ్ ధనక్ సినీ, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమకు దూరంగా ఉండే వ్యక్తి. ఆయన కార్పొరేట్ రంగంలో పనిచేస్తూనే ఒక వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఈ నిశ్చితార్థం ప్రకటన ద్వారానే ఈ జంట తమ సంబంధాన్ని మొదటిసారిగా అధికారికంగా బయటపెట్టారు. అంత‌కుముందు ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు క‌లుసుకున్నారు.

నటి జియా శంకర్ టెలివిజన్ పరిశ్రమలో సహాయక పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించి స్వయంకృషితో అగ్ర నటిగా ఎదిగారు. `క్యా హాల్, మిస్టర్ పాంచాల్?`, `పిశాచి 2`, పాపులర్ సబ్ టీవీ షో `కాటేలాల్ అండ్ సన్స్` వంటి విజయవంతమైన సీరియళ్ల ద్వారా గుర్తింపు పొంది బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అనంతరం మరాఠీ హిట్ చిత్రం `వేద్`తో వెండితెరపై అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్న జియా `బిగ్ బాస్ OTT 2` రియాలిటీ షోలో పాల్గొని తన నిజాయితీగల ప్రవర్తనతో డిజిటల్ ఆడియన్స్‌లో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. చిన్నతెర నుండి మొదలైన ఆమె ప్రయాణం సినీ రంగానికి విస్తరించి ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా.. గుర్తింపు పొందిన నటిగా తనదైన ముద్ర వేసింది.