Begin typing your search above and press return to search.

యాంకర్ ఝాన్సీ సర్పైజ్.. ఇంట్రెస్టింగ్ విషయం రివీల్..

ఇప్పుడు సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీ అదే చేశారు. రంగంలోకి దిగి టీమ్‌ తో కలిసి వర్క్ చేశారు. ప్రస్తుతం అదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   19 Sept 2026 11:35 PM IST
యాంకర్ ఝాన్సీ సర్పైజ్.. ఇంట్రెస్టింగ్ విషయం రివీల్..
X

సినిమాల్లో నటీనటులు తమ సీన్ కంప్లీట్ చేసి వెళ్లిపోవడం కామన్. కానీ షూటింగ్‌ లో అనుకోని సమస్యలు ఎదురైతే.. కెమెరా ముందున్న నటి కెమెరా వెనక్కి వెళ్లి దర్శకుడికి సపోర్ట్ గా నిలబడటం మాత్రం చాలా రేర్. ఇప్పుడు సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీ అదే చేశారు. రంగంలోకి దిగి టీమ్‌ తో కలిసి వర్క్ చేశారు. ప్రస్తుతం అదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ జర్నీలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా బాదం తదితరులు నటించారు. ఏడుగురు మహిళలు లక్కీ డ్రా ద్వారా ఫ్రాన్స్ ట్రిప్‌ కు వెళ్లడం ఆ మూవీ మెయిన్ స్టోరీ. జర్నీలో జరిగే సరదా సంఘటనలతో పాటు ఒక్కొక్కరి జీవితంలో ఉన్న సమస్యలను కూడా సినిమాలో చూపించారు. ఆ మూవీ షూటింగ్‌ లో భాగంగా టీమ్ ఫ్రాన్స్ వెళ్లింది.

అయితే అప్పటికే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ చేయడం సాధ్యం కాలేదు. దుబాయ్‌ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో పాటు టీమ్ వెళ్లాల్సిన కొన్ని లొకేషన్స్ కూడా మార్చాల్సి వచ్చిందని దర్శకుడు అభిరామ్ నాయుడు తెలిపారు. ఇలాంటి సమయంలో షూటింగ్ టీమ్‌ పై ప్రెజర్ పెరగడం కామన్. ఒకవైపు షెడ్యూల్‌ ను అడ్జెస్ట్ చేయాలి.. మరోవైపు కొత్త లొకేషన్లకు తగ్గట్టుగా షూటింగ్ ప్లాన్ చేయాలి.

సరిగ్గా అప్పుడే ఝాన్సీ దర్శకుడి దగ్గరకు వెళ్లారట. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేస్తానంటూ ముందుకొచ్చారని అభిరామ్ నాయుడు చెప్పారు. అంతేకాదు.. నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేయడం మొదలుపెట్టారని వెల్లడించారు. అంటే ఒకవైపు నటిగా తన సీన్స్ లో నటిస్తూనే.. మరోవైపు షూటింగ్ నిర్వహణలో దర్శకుడి టీమ్‌ తో కలిసి వర్క్ చేశారన్నమాట. సినిమా షూటింగ్‌ లో క్యాస్టింగ్ ఎక్స్పీరియన్స్ కేవలం యాక్టింగ్ కే పరిమితం కాదు.

ఏ సీన్ ఎలా తెరకెక్కుతుంది, లొకేషన్‌ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాలపై కూడా ఎక్స్పీరియన్స్ తో అవగాహన వస్తుంది. ఝాన్సీకి ఉన్న ఇన్నేళ్ల సినీ ఎక్స్పీరియన్స్ ఆ సమయంలో యూజ్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫారిన్ షూటింగ్ అంటే లొకేషన్, జర్నీ, టైమ్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. అలాంటి సమయంలో బాధ్యత తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది.

ఇక తెలుగు సినీ ప్రియులకు ఇప్పటివరకు యాంకర్‌ గా, నటిగా ఝాన్సీని చూసిన ప్రేక్షకులకు.. ఆమెలో అసిస్టెంట్ డైరెక్టర్ టాలెంట్ కూడా ఉందనే విషయం హ్యాపీ జర్నీతో బయటపడింది. స్క్రీన్ పై తన రోల్ కు న్యాయం చేయడంతో పాటు.. స్క్రీన్ వెనుక షూటింగ్ టీమ్‌ కు అండగా నిలిచిన ఝాన్సీ, ఆ విషయంలో మాత్రం నిజంగానే అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.