Begin typing your search above and press return to search.

RRR.. ప్రతి ఒక్క అమెరికన్ చూసేశారా?

మన దేశంతోపాటు విదేశాల్లో భారీ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతుంది. అయితే ఆ సినిమాను ప్రతి ఒక్క అమెరికన్ చూశారట.

By:  M Prashanth   |   13 Nov 2025 10:31 AM IST
RRR.. ప్రతి ఒక్క అమెరికన్ చూసేశారా?
X

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. బడా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్.

తారక్, చరణ్ క్రేజ్ ను విపరీతంగా పెంచిన మూవీ.. రాజమౌళి అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి పడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘనతలు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డును(నాటు నాటు పాట) కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ కు తొలిసారి ఆ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకొచ్చి సత్తా చాటింది.

మన దేశంతోపాటు విదేశాల్లో భారీ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతుంది. అయితే ఆ సినిమాను ప్రతి ఒక్క అమెరికన్ చూశారట. రీసెంట్ గా ఆ విషయాన్ని అమెరికన్ నటుడు, నిర్మాత, రచయిత జెస్సీ ఐసెన్ బర్గ్ తెలిపారు. తన కొత్త చిత్రం నౌ యూ సీ మీ: నౌ యు డోంట్ ప్రమోషన్స్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఆర్ఆర్ఆర్ మూవీపై మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అద్భుతమైన చిత్రంగా కొనియాడారు. మూవీ మేకింగ్ ఆకట్టుకుందని అన్నారు. ఇండియన్ మూవీ టేస్ట్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. సినిమాను ప్రతి అమెరికన్ ఆర్ఆర్ఆర్ చూశారని జెస్సీ ఐసెన్ బర్గ్ పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జెస్సీ ఐసెన్ బర్గ్ కామెంట్స్ తో మూవీ.. ఎంతవరకు చేరుకుందో స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి... మూడేళ్లు అయిపోయింది. 2022 మార్చి 22న సినిమా విడుదలైంది.

కానీ ఇప్పటికీ ఆ సినిమా కోసం ఎక్కడో ఓ చోట మాట్లాడుతూనే ఉంటారు. అది ఆ మూవీకి ఉన్న రేంజ్.. క్రేజ్. ఎంతైనా రాజమౌళి తీసిన సినిమా కదా.. ఆ మాత్రం కచ్చితంగా ఉంటుంది. 1920వ దశకంలో బ్రిటిష్ పాలనలో ఇద్దరు నిజమైన భారతీయ విప్లవకారులు, అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) మధ్య కల్పిత కథతో వచ్చిన మూవీ ఇప్పటికీ వార్తల్లోనే ఉండడం విశేషం.