పెళ్లి వార్తలపై వెల్లువెత్తిన ఊహాగానాలు!
ఆ ఫోటోలపై ఆమె సన్నిహితులు , స్నేహితులు చేసిన ఓ కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన ఉండటంతో అది వైరల్‌గా మారింది.
By: Srikanth Kontham | 22 April 2026 1:00 AM ISTప్రముఖ బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్ అద్భుతమైన నటనతోనే కాదు. వ్యక్తిగత జీవితంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌పై వచ్చిన ఓ ఆసక్తికరమైన కామెంట్ తో ఈ చర్చ మొదలైంది. ఈ కామెంట్ చూసిన అభిమానులు, జెన్నిఫర్ త్వరలోనే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.విషయంలోకి వెళ్తే జెన్నిఫర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది.
ఆ ఫోటోలపై ఆమె సన్నిహితులు , స్నేహితులు చేసిన ఓ కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన ఉండటంతో అది వైరల్‌గా మారింది. జెన్నిఫర్ కూడా ఆ కామెంట్‌కు స్పందించిన తీరు పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలపడం మొదలుపెట్టారు. జెన్నిఫర్ వింగెట్ గతంలో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జెన్నిపర్ కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది.
`బేహద్`, `బేపన్నా` వంటి సీరియల్స్‌తో స్టార్ హోదాను దక్కించుకుంది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా? ఎక్కడా వెనకడుగు వేయకుండా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ ఆమెపై వివాహ వార్తలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రచారంపై జెన్నిఫర్ వింగెట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సెలబ్రిటీల విషయంలో చిన్న చిన్న కామెంట్స్ , ఫోటోలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీయడం సహజమే. కొన్నిసార్లు అవి స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలు కూడా అవుతాయి.
అయినప్పటికీ జెన్నిఫర్ వంటి పాపులర్ స్టార్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఆమె ఫాలోవర్లలో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపింది. ఆమెకు కాబోయే వరుడు ఎవరై ఉంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. జెన్నిపర్ స్వయంగా స్పందిస్తే తప్ప ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఏదేమైనా? జెన్నిఫర్ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా? ఆమె సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ పరంగా శిఖరాగ్రాన ఉన్న ఆమె వ్యక్తిగత జీవితంలోనూ అంతే సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్తున్నారు.
