వీడియో : లైవ్ స్టేజ్ షోలో హీరోయిన్ స్కర్ట్ జారింది.. పబ్లిసిటీ స్టంట్?
ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఎప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో ఉంటారు.
By: Ramesh Palla | 30 July 2025 2:09 PM ISTప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఎప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో ఉంటారు. అయిదు పదుల వయసు దాటినా కూడా జెన్నిఫర్ లోపెజ్ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సోషల్ మీడియాలో ఆమె అందమైన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. హాలీవుడ్ సినిమాల్లోనూ తనదైన సత్తా చాటిన జెన్నిఫర్ ఎన్నో స్టేజ్ షో లు చేసింది. ఆమె స్టేజ్ షో లకు ప్రేక్షకులు వేలాది మంది హాజరు అవుతూ ఉంటారు. ఆమె లైవ్ స్టేజ్ షో లకు ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. అందుకే ఆమె ఎక్కడ షో చేసినా మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె అనేక దేశాల్లో లైవ్ షో లు చేసింది.
అయిదు పదుల వయసులోనూ జెన్నీఫర్ అందం
ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే వివాదాలు, విడాకుల వార్తలతో జెన్నిఫర్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈమెకు ఉన్న అభిమానుల కారణంగా చిన్న వార్త అయినా వైరల్ అవుతూ ఉంటుంది. జెన్నిఫర్ గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు జనాలు మీడియాలో ఆమె గురించి వచ్చే వార్తలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ మధ్య పెళ్లిలు, విడాకులు, బ్రేకప్‌లు అంటూ చాలా వార్తలు ఈమె గురించి వచ్చాయి. డాన్సర్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న జెన్నిఫర్ అయిదు పదుల వయసులోనూ తన డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఒక భారీ స్టేజ్ షో ను చేసింది. ఆ స్టేజ్ షో లో షాకింగ్ సంఘటన జరిగింది.
లైవ్‌లో జారిన మినీ స్కర్ట్
జెన్నిఫర్ అప్ ఆల్ నైట్ : లైవ్ ఇన్ 2025 పేరుతో పోలాండ్ వార్సాలోని పీజీఈ నారోడేవి స్టేడియంలో డాన్స్ షో చేసింది. ఈ లైవ్ కాన్సర్ట్ కు వేలాది మంది హాజరు అయ్యారు. షో కి హాజరు అయిన ప్రేక్షకులను చూసి నిర్వాహకులు సైతం షాక్ అయ్యారట. స్టేడియం మొత్తం నిండి పోయింది, అత్యధిక రేట్లకు టికెట్ కొనుగోలు చేసి మరీ షో కు హాజరు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంత మందిని ఉత్సాహపరుస్తూ జెన్నీఫర్ స్టేజ్ షో చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఆమె ధరించిన గోల్డెన్ కలర్ మినీ స్కర్ట్ జారి పోయింది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె వెంటనే తన చేతులను అడ్డు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత స్కర్ట్ ను గురించి వదిలేసింది.
జెన్నీఫర్ పబ్లిసిటీ స్టంట్
పక్కన ఉన్న కో డాన్సర్ ఆ స్కర్ట్ ను కట్టేందుకు ప్రయత్నించాడు, అయినా అది మళ్లీ జారి పోయింది. దాంతో ఆ స్కర్ట్ ను జనాల్లోకి విసిరేసింది. అదే సమయంలో సరదాగా నేను సాధారణంగా అండర్‌వేర్ వేసుకోను, కానీ ఈ రోజు అదృష్టవశాత్తు అండర్ వేర్ వేసుకున్నాను అంటూ అక్కడ ఉన్న అందరినీ నవ్వించింది. ఫైనల్‌గా జెన్నీఫర్ ఆ మినీ స్కర్ లేకుండా, అండర్ వేర్ పైనే షో చేసింది. ఇది మొత్తం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్న వారు ఉన్నారు. స్టేజ్ పై అలా స్కర్ట్ ఊడటం అంటే మామూలు విషయం కాదు, అది అంతా ముందస్తు ప్లాన్ ప్రకారం చేసి ఉంటారు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం జెన్నీఫర్ వంటి స్టార్ ఇలాంటి చిల్లర వేశాలు వేయరు అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది ఆమె చెబుతుందేమో చూడాలి.
