అంబానీ పెళ్లిలో రిహానా.. మంతెన పెళ్లిలో జెలో
ఇప్పుడు అంబానీ పెళ్లి తర్వాత మళ్లీ అదే రేంజులో సాగుతున్న మరో భారతీయ పెళ్లి కోసం ఏకంగా పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ (జెలో) అమెరికా నుంచి దిగి వచ్చింది.
By: Sivaji Kontham | 24 Nov 2025 10:48 AM ISTప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో పాప్ స్టార్ రిహానా సందడి గురించి తెలిసిందే. రిహానా మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలతో అహూతులను రంజింపజేసింది. తనతో పాటు ఒక ఫ్లైయింగ్ హౌస్ ని వెంట తీసుకువచ్చిందని జోక్ చేసారు. తన దుస్తులు, ఆభరణాలు సహా తన టీమ్ తో రిహానా ఏకంగా ఒక విమానానికి సరిపడా సరంజామా తీసుకువచ్చింది. అంబానీ వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి రిహానా చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఇప్పుడు అంబానీ పెళ్లి తర్వాత మళ్లీ అదే రేంజులో సాగుతున్న మరో భారతీయ పెళ్లి కోసం ఏకంగా పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ (జెలో) అమెరికా నుంచి దిగి వచ్చింది. ఒర్లాండోకు చెందిన బిలియనీర్, ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో అయిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన - సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజుల పెళ్లిలో జెలో అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకుంది.
అమెరికన్ గాయని-నటి జెన్నిఫర్ లోపెజ్ రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో నవంబర్ 22న అడుగుపెట్టారు. ఆదివారం నాడు తన కచేరీతో అతిథులను అలరించింది. జెలో తన చార్ట్ బస్టర్ పాటల్లో కొన్నిటిని వేదికపై ప్రదర్శించింది. ఆన్ ది ఫ్లోర్, ఐంట్ యువర్ మామా, గెట్ రైట్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో కొన్నింటిని జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శించింది. ఈ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఇక 56 ఏళ్ల వయసులోను జెలో స్పీడ్, ఎనర్జీలో ఎక్కడా తగ్గలేదు. జెలో బికినీ తరహా డిజైనర్ సూట్ లో వేదికపై రక్తి కట్టించింది. మోకాలి ఎత్తు బూట్లు ధరించిన జె-లో గోల్డెన్ బాడీసూట్‌లో ప్రేక్షకుల్లో గుబులు పుట్టించింది. జోలో సోలోగా ఈ ప్రదర్శన ఇవ్వడం విశేషం.
జెలో అంతకుముందు సాంప్రదాయ భారతీయ దుస్తులలో నేత్ర - వంశీల వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. పింక్ చీరలో దేశీ లుక్ తో ఈ విదేశీ భామ ఆకట్టుకుంది. జోలో ధరించిన చీరలో క్రిస్-క్రాస్ షిమ్మరీ డీటెయిలింగ్ ప్రధాన ఆకర్షణ. దీనికి ఎమరాల్డ్ నెక్లెస్ ని యాడప్ చేసింది.
మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఈ వివాహ వేడుకల కోసం బాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్లు హాజరయ్యారు. రణ్ వీర్ సింగ్, కృతి సనన్, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ తదితరులు ఈ వేడుకలో ప్రదర్శనలు ఇచ్చారు. నటీమణులలో మాధురి దీక్షిత్ , నోరా ఫతేహి కూడా తమ ప్రదర్శనలతో వేడుకలకు స్టార్ పవర్ ని, కలరింగును జోడించారు.
బిలియనీర్ మంతెన వెడ్డింగ్ కోసం రాజస్థాన్ -ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్, జెనానా మహల్, లేక్ పిచోలాలోని ఐలాండ్ ప్యాలెస్ వంటి లగ్జరీ వెన్యూలలో ఈ వేడుకలు జరిగాయి. అతిథుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అతడి స్నేహితురాలు కూడా ఉన్నారు.
జెన్నిఫర్ లోపేజ్ గురించి ప్రస్థావిస్తేఏ, `కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్`లో ఇటీవల తెరపై కనిపించిన జెలో, బ్రెట్ గోల్డ్‌స్టెయిన్ సరసన రొమాంటిక్ కామెడీ `ఆఫీస్ రొమాన్స్`ను రూపొందించారు. లివ్ కాన్ స్టంటైన్ నవల ది లాస్ట్ మిసెస్ పారిష్ అనుసరణలోను కనిపించనున్నారు. డిసెంబర్‌లో లాస్ వెగాస్‌లో `జెన్నిఫర్ లోపెజ్: అప్ ఆల్ నైట్ లైవ్`లో కూడా నటించనుంది.
