Begin typing your search above and press return to search.

తన దుస్తులతో గూగుల్ రూపురేఖలే మార్చిన జెన్నీఫర్.. అసలు ఏమైందంటే?

చాలామంది ఏ విషయాన్నైనా సరే సెర్చ్ చేయడం కోసం గూగుల్ ను ఉపయోగిస్తారు. గూగుల్ మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తుంది.

By:  Madhu Reddy   |   9 Sept 2025 12:00 AM IST
తన దుస్తులతో గూగుల్ రూపురేఖలే మార్చిన జెన్నీఫర్.. అసలు ఏమైందంటే?
X

చాలామంది ఏ విషయాన్నైనా సరే సెర్చ్ చేయడం కోసం గూగుల్ ను ఉపయోగిస్తారు. గూగుల్ మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు ఏ విషయాన్ని అయినా పూర్తి డేటాతో మనకు అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే అలాంటి గూగుల్ ని చాలామంది ప్రజలు సమాచారం తెలుసుకోవడానికి కాకుండా అందులో ఉన్న ఫోటోలు చూడడానికి కూడా ఇష్టపడతారు.. కానీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. గూగుల్ లో ఉండే కథనాన్ని చదివడానికంటే ఎక్కువగా ఫోటోలు చూడడానికి మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఆ గూగుల్ లో ఉండే ఇమేజెస్ ఎవరివల్ల సృష్టించబడ్డాయో మాత్రం చాలా మందికి తెలియదు. మరి గూగుల్ ఇమేజెస్ సృష్టించడానికి మూలకారణం ఎవరు? ఎవరివల్ల ఈ గూగుల్ ఇమేజెస్ పుట్టుకొచ్చాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ ఇమేజెస్ సృష్టించడానికి ప్రధాన కారణం ఎవరో కాదు అమెరికన్ గాయని జెన్నీఫర్ లోపేజ్.. జెన్నీఫర్ లోపేజ్ కి గూగుల్ ఇమేజెస్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అని మీకు డౌట్ రావచ్చు.అయితే వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే.. 2000 సంవత్సరంలో జెన్నీఫర్ లోపేజ్ గ్రామీ అవార్డ్స్ కి వచ్చిన టైంలో వెర్సాస్ ని ధరించింది.. జెన్నీఫర్ ధరించిన ఐకానిక్ గ్రీన్ వెర్సాస్ డ్రెస్ ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే జెన్నీఫర్ లోపేజ్ వేసుకున్న ఆ డ్రెస్ వైరల్ అవ్వడంతో చాలామంది ఆమె వేసుకున్న డ్రెస్ కు సంబంధించిన ఫోటోల కోసం గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేశారు. కానీ ఆ సమయంలో ఆ ఫోటోలు అందుబాటులో లేవు. ఈ విషయం గూగుల్ దృష్టికి వెళ్లడంతో చాలామంది కథనాలు చదవడం కంటే ఫోటోలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అని గ్రహించిన గూగుల్ యాజమాన్యం ఇక అప్పటినుంచి ఫోటోలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. అలా జెన్నీఫర్ లోపేజ్ వేసుకున్న డ్రెస్ ని చాలామంది గూగుల్ లో వెతకడంతో.. గూగుల్ ఇమేజెస్ సృష్టించడానికి మూల కారణం అయ్యాయి అంటూ గూగుల్ సీఈవో ఎరిక్ స్మిత్ అప్పట్లో వెల్లడించారు.

అలా జెన్నీఫర్ లోపేజ్ డ్రెస్ బాగుండడంతో చాలామంది జనాలు గూగుల్ లో 'ఓకే గూగుల్ నాకు వెర్సాస్ జంగిల్ డ్రెస్ చూపించు' అంటూ సెర్చ్ చేశారట.. ఇక ఈ కారణంగానే గూగుల్ లో ఇమేజెస్ సెర్చ్ ఇంజన్ ని సృష్టించారు. ఇక ఈ విషయం గురించి అప్పట్లో గూగుల్ సీఈవో , ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ.. "చాలామంది ప్రజలు టెక్స్ట్ కంటే ఎక్కువగా ఫోటోలను చూడ్డానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని 2000 సంవత్సరం గ్రామీ అవార్డుల తర్వాత తెలిసి వచ్చింది. అక్కడ జెన్నీఫర్ లోపేజ్ వేసుకున్న గ్రీన్ వెర్సాస్ డ్రెస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో జెన్నీఫర్ వేసుకున్న డ్రెస్ గురించి ఎంతోమంది శోధించారు.. అయితే ఆ సమయంలో వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి మా దగ్గర కచ్చితమైన మార్గం లేదు. ఆ సమయంలోనే గూగుల్ ఇమేజెస్ అనే శోధన పుట్టింది.. అలా జెన్నీఫర్ లోపేజ్ కారణంగా ఇంటర్నెట్ లో ఫోటోలు చూడడానికి కొత్త మార్గం మేం కనుగొన్నాం.. అయితే ఈ ప్రక్రియ అనేది రాత్రికి రాత్రే జరిగింది అయితే కాదు. కానీ వినియోగదారులు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని.. ఓహో మేము ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ ని నిర్మించాలి కదా అని ఆ సమయంలో క్లారిటీకి వచ్చాం..

దాంతో కంపెనీలో ఉన్న ఉద్యోగులతో కలిసి గూగుల్ లో ఇమేజెస్ సెర్చ్ ఇంజన్ ని నిర్మించాము. అలా గూగుల్ ఇమేజెస్ ఇంజన్ ప్రారంభించడానికి జెన్నీఫర్ లోపేజ్ కారణమయ్యారు.ఇక జెన్నీఫర్ 2000 సంవత్సరంలో ధరించిన ఆ వెర్సాస్ డ్రెస్ గురించి ఇప్పటికి కూడా గూగుల్ లో చాలామంది ప్రశ్నలు అడుగుతారు.. జెన్నీఫర్ ఆకుపచ్చ దుస్తులు, జెన్నీఫర్ లోపేజ్ గ్రామీ దుస్తులు అంటూ ప్రశ్నిస్తారు.. అలా జెన్నీఫర్ వేసుకున్న డ్రెస్ పై జనాలు ఎంత మోహపడ్డారో అర్థం చేసుకోవచ్చు." అంటూ తెలిపారు.

అలా జెన్నీఫర్ లోపేజ్ కారణంగా 2001 జూలై నుండి గూగుల్ ఇమేజెస్ సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ ని ప్రారంభించింది.. ఇక ఇది స్టార్ట్ అయిన వెంటనే తొలి దశలో దాదాపు 250 మిలియన్ల ఇండెక్స్ చిత్రాలను అందించారు.. ఈ గూగుల్ ఇమేజెస్ లో సెలబ్రిటీలు,ఫ్యాషన్, ల్యాండ్ మార్క్,థంబ్ నెయిల్స్ ఇలా ఎన్నో చూడవచ్చు.. గూగుల్ ఇమేజెస్ అనే ఆవిష్కరణ చాలా విప్లవాత్మకమైనది.. అంతేకాదు ఒక డ్రెస్ టెక్నాలజీలో మార్పుకి కారణం అవ్వడం అనేది నిజంగా ఓ అద్భుతమే.