56 వయసులో జెన్నిఫర్ లోపేజ్ బాడీ సూట్ దుమారం
లాస్ వెగాస్ రెసిడెన్సీ షోలో భాగంగా మార్చి 2026లో వరుసగా ఎనిమిది రోజుల పాటు లాస్ వెగాస్‌లో లైవ్ షోలు ఇవ్వబోతున్నారు.
By: Sivaji Kontham | 21 Feb 2026 6:18 PM ISTజెన్నిఫర్ లోపేజ్ (జెలో) గురించి పరిచయం అవసరం లేదు. 56 ఏళ్ల వయసులోనూ తన స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నారు. జెలో ఇంతకుముందు అంబానీల పెళ్లి వేడుకలో పాల్గొని షోస్టాపర్ గా నిలిచింది. ఇప్పుడు కొత్త పాట `సేవ్ మీ టునైట్` తో మరోసారి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ని ప్లాన్ చేసారు జెలో.
ప్రముఖ ఫ్రెంచ్ డీజే, మ్యూజిక్ ప్రొడ్యూసర్ డేవిడ్ గ్వెట్టా కలిసి చేసిన కొత్త సాంగ్ ఇది. మార్చి 6న ఈ పాట విడుదల కానుండగా జెలో స్టేజీ పెర్ఫామెన్స్ హాట్ టాపిగ్గా మారింది. జెన్నిఫర్ తన ఇన్‌స్టాలో ఒక పవర్‌ఫుల్ వీడియోను షేర్ చేస్తూ ఈ తేదీని ప్రకటించారు. ఆ వీడియోలో మెరిసే సిల్వర్ బాడీసూట్ ధరించి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది ఒక క్లబ్ ఆంథమ్ లాగా అలరించనుంది. 2011లో వచ్చిన ఆమె హిట్ సాంగ్ `ఆన్ ది ఫ్లోర్` లాంటి మ్యాజిక్‌ను ఈ పాట మళ్లీ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అయితే ఇది `లాస్ వెగాస్` రెసిడెన్సీ షోకి సంబంధించింది. ఈ షో పేరు జెన్నిఫర్ లోపేజ్ అప్ ఆల్ నైట్ . ఇది లాస్ వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న భారీ మ్యూజిక్ షో. ఆ వీడియోలో జెన్నిఫర్ డీప్ నెక్ లైన్ ఉన్న సిల్వర్ బాడీసూట్, దానికి సరిపోయే లాంగ్ బూట్స్ ధరించి తన స్టేజ్ ఎనర్జీని చూపించారు.
అయితే అభిమానులు తన కొత్త పాట సేవ్ మి టునైట్ ప్రమోషన్‌లో భాగంగా పాత పెర్ఫార్మెన్స్ క్లిప్‌ను, జెన్నిఫర్ తాజా ఫోటోలను జోడించి ఆమె టీమ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. 56 వయసులోను ఏజ్‌లెస్ బ్యూటీ ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్సులు చేస్తూ ఆశ్చర్యపరుస్తోందని కితాబిచ్చేస్తున్నారు.
జెన్నిఫర్ లోపేజ్ టూర్ విశేషాలు:
లాస్ వెగాస్ రెసిడెన్సీ షోలో భాగంగా మార్చి 2026లో వరుసగా ఎనిమిది రోజుల పాటు లాస్ వెగాస్‌లో లైవ్ షోలు ఇవ్వబోతున్నారు. మార్చి 6, 7, 13, 14, 20, 21, 27, 28 తేదీలలో ఈ షోలు నడుస్తాయి. తన రెండో ఆల్బమ్ J.Lo విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే తన పాత హిట్స్ -కొత్త పాటలతో ఈ ఏడాదిని JLO 26 సెలబ్రేషన్‌గా మార్చేశారు.
56 ఏళ్ల వయసులో కూడా జెన్నిఫర్ లోపేజ్ తన బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, యంగ్ హీరోయిన్లకు పోటీగా స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం తన క్రమశిక్షణకు నిదర్శనం. కఠిన వ్యాయామం చేస్తేనే కానీ ఈ రూపాన్ని మెయింటెయిన్ చేయడం అంత సులువేమీ కాదు.
