Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు అంతా ఇదే చూస్తున్నారట..!

ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ లో ప్రతి వారం పదుల కొద్ది కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌, ఇతర కంటెంట్‌ స్ట్రీమింగ్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం.

By:  Ramesh Palla   |   9 Feb 2026 8:00 PM IST
నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు అంతా ఇదే చూస్తున్నారట..!
X

ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ లో ప్రతి వారం పదుల కొద్ది కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌, ఇతర కంటెంట్‌ స్ట్రీమింగ్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్‌ అయిన కొన్ని వారాల తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం, ఆ తర్వాత ట్రెండింగ్‌లోకి రావడం చూస్తూ ఉంటాం. ఇక కొన్ని డాక్యుమెంట్స్‌ సైతం కొన్నాళ్ల తర్వాత వాటి గురించి జనాలకు తెలిసిన తర్వాత టాప్‌ లో ట్రెండ్‌ కావడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అయ్యి ఐదేళ్లకు పైగా అయ్యింది. ఇన్నాళ్లు ఆ డాక్యుమెంటరీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఏకంగా కొత్త సినిమాలు, సిరీస్‌లను పక్కన నెట్టి ఆ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్‌ రేటింగ్‌ లో టాప్‌ 10 లో చోటు దక్కించుకుంది.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ : ఫిల్తీ రిచ్‌ డాక్యుమెంటరీ..

ఆ డాక్యుమెంటరీ పేరు 'జెఫ్రీ ఎప్‌స్టీన్: ఫిల్తీ రిచ్'. 2020లో ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వల్ల ఇబ్బంది పడ్డ వారిని కెమెరా ముందుకు తీసుకు వచ్చి మాట్లాడించడం, ఇంకా చాలా విషయాలను ఆ డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. బాధితులు, సాక్ష్యులను ఈ డాక్యుమెంటరీ లో చూపించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఈ వెబ్‌ సిరీస్ గురించి సోషల్‌ మీడియాలో ఎక్కువగా చర్చ జరగలేదు. ఎందుకంటే ఆ సమయంలో జెఫ్రీ గురించి ఎక్కువగా సమాచారం బయటి వారికి తెలియదు. ఆయన ఒక సాధారణ నేరగాడు మాత్రమే అయ్యి ఉంటాడని అంతా భావించారు. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా కోర్ట్‌ విడుదల చేసిన కొన్ని ఫైల్స్ కారణంగా జెఫ్రీ ఏ స్థాయి నేరగాడో అనే విషయం ప్రపంచానికి తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీని చూడాలని జనాలు నెట్‌ఫ్లిక్స్ ముందు క్యూ కట్టారు.

నెట్‌ఫ్లిక్స్ టాప్‌ 10 లో ట్రెండ్‌..

ఈ మధ్య కాలంలో అత్యధికంగా చూడబడ్డ డాక్యుమెంటరీగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫిల్తీ రిచ్‌ డాక్యుమెంటరీ నిలిచింది అంటూ టాక్‌ వినిపిస్తుంది. దోషిగా తేలిన జెఫ్రీ జైలులో ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు, అతడి జీవన శైలి ఎలా సాగింది ఇంకా పలు విషయాలను డాక్యుమెంటరీలో చూపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇప్పుడు జెఫ్రీ కి ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లుగా వెల్లడి అయింది. అందుకే ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు గాను ఈ డాక్యుమెంటరీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్‌ చేసిన తర్వాత ఈ స్థాయిలో స్పందన రాలేదని, ఈ మధ్య కాలంలో అత్యధికులు దీనిని చూడటం ఆశ్చర్యంగా ఉందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పేరు కనుక ఆయన డాక్యుమెంటరీ ఆసక్తిని రేపుతోంది.

అమెరికన్‌ నేరస్తుడు..

జెఫ్రీ ఒక అమెరికన్‌ నేరస్తుడు. ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా నెట్‌వర్క్ ఉండేది. మైనర్‌ బాలికలను పెద్ద ఎత్తున ట్రాఫికింగ్ కి పాల్పడ్డట్లుగా నేరం రుజువు అయింది. ఆయన్ను విచారించిన సమయంలో చాలా మంది పేర్లు చెప్పాడు. కానీ ఇన్నాళ్లు ఆ పేర్లను, ఆయన ఇచ్చిన వాంగ్మూలం ను బయటకు రానివ్వలేదు. కానీ ఇటీవల అమెరికా తీసుకు వచ్చిన కొత్త చట్టం కారణంగా ఆయన విచారణకు సంబంధించిన ఫైల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఆగస్టు 10, 2019లో జైలు జీవితం అనుభవిస్తూనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య విషయంలోనూ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన బతికి ఉంటే చాలా మంది జీవితాలు తలకిందులు అవుతాయి అనే ఉద్దేశంతో ఆయన హత్య చేశారు అనేది కొందరి అనుమానం. అసలు విషయం ఏంటి అనేది మాత్రం భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు జెఫ్రీ పై తీసిన డాక్యుమెంటరీ మాత్రం బాగా వైరల్‌ అవుతోంది.