దృశ్యం 3 ప్లాన్ రివర్స్ అయ్యేట్టు ఉందిగా..!
జీతూ జోసెఫ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో ఆయన చేసే సినిమాలైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి.
By: Ramesh Boddu | 2 Nov 2025 10:07 AM ISTజీతూ జోసెఫ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో ఆయన చేసే సినిమాలైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. వాటిలో భాగంగా దృశ్యం సీరీస్ లు సూపర్ థ్రిల్ అందించాయి. దృశ్యం సినిమాలు మిగతా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యి సక్సెస్ అందుకున్నాయి.
దృశ్యం 1, 2 సినిమాలు అన్ని భాషల్లో మంచి ఫలితాలు అందుకున్నాయి. ఐతే దృశ్యం 3 సినిమాను జీతూ జోసెఫ్ ఒకేసారి అన్ని భాషల్లో తెరకెక్కించాలని అనుకున్నారు. అంటే దృశ్యం ఏ భాషలో రీమేక్ అయ్యిందో అన్నిటిలో అక్కడ హీరోలను కొనసాగిస్తూ పార్ట్ 3 తీయాలని అనుకున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 3..
అందుకు తగినట్టుగానే ప్లానింగ్ కూడా చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 3 కి అంతా రెడీ అయ్యారు. తెలుగులో దృశ్యం సీరీస్ లు విక్టరీ వెంకటేష్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్ ఆ సినిమాలు చేశారు. తమిళ్ లో కమల్ హాసన్ పాపనాశన్ గా చేసి మెప్పించారు. ఐతే దృశ్యం 3 ని కమల్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అందుకే మలయాళంతో పాటు తెలుగులో వెంకటేష్ తో.. హిందీలో అజయ్ దేవగన్ తో ఒకేసారి షూట్ చేసే ప్లాన్ చేస్తున్నారు జీతూ జోసెఫ్.
ఐతే వెంకటేష్ ఓ పక్క చిరంజీవి సినిమాలో క్యామియోతో పాటు త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు దృశ్యం 3 కి డేట్స్ కుదరవనే చెబుతున్నారట. మరోపక్క హిందీ దృశ్యం 3 కి అక్కడ మేకర్స్ తో కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది. దృశ్యం 3కి జీతు జోసెఫ్ కథ కాకుండా బాలీవుడ్ రైటర్స్ ఒక సీక్వెల్ స్టోరీ రాసుకున్నారట. సో అక్కడ కూడా దృశ్యం 3 తెరకెక్కే ఛాన్స్ లేదు.
జీతూ జోసెఫ్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా లేదు..
చూస్తుంటే మళ్లీ మోహన్ లాల్, జీతు జోసెఫ్ మాత్రమే దృశ్యం 3 ముందు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగు స్పాయిలర్స్ వస్తాయి. అప్పుడు ఎంత రీమేక్ చేయాలని అనుకున్నా వేస్ట్ అవుతుంది. దృశ్యం 3 అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కించి ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్న జీతూ జోసెఫ్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా లేదు. మరి మోహన్ లాల్ తోనే పాన్ ఇండియా రిలీజ్ గా దృశ్యం 3 రిలీజ్ చేసినా చేయొచ్చని టాక్ కూడా నడుస్తుంది. మరి దృశ్యం లవర్స్ కి ఈ సీక్వెల్ పై జరుగుతున్న డిస్కషన్స్ అయితే కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. జీతూ జోసెఫ్ మాత్రం కేవలం మలయాళంలోనే కాదు ఈ కథను మిగతా బహషల్లో రీమేక్ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట. మరి మేకర్స్ ఎలా నిర్ణయిస్తారో చూడాలి.
