Begin typing your search above and press return to search.

విష్ణుప్రియతో పెళ్లా? జేడీ చక్రవర్తి రెస్పాన్స్ ఏంటంటే?

"రెండో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు నేను కూడా విన్నాను. అయితే అవి పూర్తిగా ఫేక్" అని జేడీ స్పష్టం చేశారు. విష్ణుప్రియ గురించి మాట్లాడిన ఆయన, "ఆమె నా ప్రియ శిష్యురాలు.

By:  M Prashanth   |   26 April 2026 10:45 AM IST
విష్ణుప్రియతో పెళ్లా? జేడీ చక్రవర్తి రెస్పాన్స్ ఏంటంటే?
X

యాంకర్‌ విష్ణుప్రియ ఇటీవల పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో సబ్‌ స్క్రిప్షన్ కంటెంట్‌ తో హాట్ టాపిక్‌ గా మారిన ఆమెపై కొన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తితో ఆమెకు స్పెషల్ రిలేషన్ ఉందని, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఆ గాసిప్స్‌ కు తాజాగా జేడీ పుల్ స్టాప్ పెట్టారు.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న ఆయన ఇప్పుడు గాయపడ్డ సింహం మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మే 1న సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌ లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో తన సంబంధం, పెళ్లి వార్తలపై వచ్చిన ప్రశ్నలకు ఆయన స్పందించారు.

"రెండో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు నేను కూడా విన్నాను. అయితే అవి పూర్తిగా ఫేక్" అని జేడీ స్పష్టం చేశారు. విష్ణుప్రియ గురించి మాట్లాడిన ఆయన, "ఆమె నా ప్రియ శిష్యురాలు. నేను ఫోన్ చేస్తే గురువుగారు అంటూ మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయికి నాకు ఎఫైర్ అని అంటే అంత కన్నా దుర్మార్గం లేదు" అని జేడీ చక్రవర్తి తెలిపారు.

"నేను ఆమెను పెళ్లి చేసుకోవడమా? నన్ను తన గురువులా ఆమె ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఎఫైర్ అనేది అబద్ధం. గురు శిష్యుల సంబంధం పెళ్లికి దారి తీస్తే వేరే పరిణామాలు ఉంటాయి" అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో విష్ణుప్రియ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఆ గాసిప్స్‌ కు కారణమయ్యాయి.

ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న ఆమె, జేడీ చక్రవర్తిపై తనకు ప్రత్యేకమైన అభిమానముందని, ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పింది. అంతేకాకుండా, ఆయన కుటుంబం అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని నవ్వుతూ తెలిపింది. ఆ సమయంలో ఆమె కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. అప్పుడే ఆ విషయంపై స్పందించిన జేడీ, విష్ణుప్రియ వ్యాఖ్యల వెనుక అసలు కారణాలు వెల్లడించారు.

"విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఓ వెబ్ సిరీస్‌ లో పని చేశాం. దాదాపు 40 రోజులు కలిసి షూటింగ్ చేశాం. ఆ సమయంలో దర్శకుడు ఆమెకు ఒక సూచన ఇచ్చారు. నేను నటించిన సినిమాలు రోజూ చూడమన్నారు" అని చెప్పారు. అలా తన సినిమాలు చూస్తూ, అందులోని పాత్రలకు ఆమె అట్రాక్ట్ అయిందని తెలిపారు. "ఆమె నాకు కాదు, నా పాత్రలకు అభిమానిగా మారింది. అందుకే అలా చెప్పింది. మా మధ్య లవ్ రిలేషన్ లేదు. గురు-శిష్య అనుబంధం మాత్రమే ఉంది" అని స్పష్టం చేశారు. ఏదేమైనా విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్‌ పై జేడీ చక్రవర్తి క్లియర్‌ గా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చినట్లే.