Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు చేస్తే… జేడీ చక్రవర్తి కెరీర్ మారిపోయేదా?

సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కొత్త విషయం కాదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 April 2026 6:00 PM IST
ఆ రెండు సినిమాలు చేస్తే… జేడీ చక్రవర్తి కెరీర్ మారిపోయేదా?
X

సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ అలా మారిన ప్రాజెక్టులు కొన్ని సార్లు ఇండస్ట్రీ హిస్టరీనే మార్చేస్తాయి. హిట్ అయితే మిస్ అయిన హీరోకు జీవితాంతం రిగ్రెట్‌గా మిగిలిపోతుంది కానీ ఫ్లాపైతే మాత్రం ఊపిరి పీల్చుకుంటారు. ఈ కామన్ ఫెనామెనాన్‌ను తాజాగా సీనియర్ నటుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి తన అనుభవాలతో మరోసారి హైలైట్ చేశారు. తన కెరీర్‌లో తాను మిస్ అయిన సినిమాలుగా ఆయన చెప్పిన రెండు ప్రాజెక్టులు ప్రత్యేకంగా చర్చకు దారితీస్తున్నాయి. అందులో మొదటిది సేతు. డైరెక్ట‌ర్ బాల తొలి సినిమా అయిన ఇది మొదట జేడీకి ఆఫర్ అయిందని ఆయన వెల్లడించడం ఆసక్తికరం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయార‌ట‌. తర్వాత అదే సినిమా విక్ర‌మ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇక రెండోది ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం. ఈ సినిమా ర‌వితేజకు టాలీవుడ్‌లో బ్రేక్ థ్రూ ఇచ్చిన స్టార్ సినిమా. ఈ ప్రాజెక్ట్ కూడా జేడీ చేతికి వచ్చి, చివరికి టైమింగ్ కారణంగా మిస్ అయినట్టు ఆయన చెప్పడం మరో కీలక అంశం. ఆ టైమ్ లో ముంబై వెళ్లాల్సి రావ‌డంతో ఆ సినిమా చేయ‌లేక‌పోయాన‌ని జేడీ చెప్పిన మాటలు డెస్టినీని ఎత్తి చూపుతున్నాయి.

ఈ సందర్భంలో వాట్ ఇఫ్? అనే ప్రశ్నలు కూడా సహజంగానే ముందుకు వస్తాయి. జేడీ సేతు సినిమా చేసి ఉంటే తమిళంలో స్టార్ అయ్యేవాడా? లేదా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో నటించి ఉంటే రవితేజ స్థానంలో ఆయనే నిలిచేవాడా? ఇవి స్పష్టమైన సమాధానాలు లేని ప్రశ్నలే అయినప్పటికీ, ఇండస్ట్రీలో హీరోల కెరీర్ గ్రాఫ్ ను ఎలా ఒక్కో సినిమా మార్చేస్తుందో అర్థ‌మ‌వుతుంది.

ఈ రెండు సినిమాల‌నూ మిస్ అవ‌డం ప‌ట్ల తాను రిగ్రెట్ గా ఫీల‌వుతున్నాన‌ని జేడీ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. జేడీ చక్రవర్తి ఈ విషయాలను ఓపెన్‌గా అంగీకరించడం కూడా గమనార్హం. సాధారణంగా నటులు మిస్ అయిన అవకాశాలపై మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. కానీ ఆయన మాత్రం ఫ్రాంక్‌గా చెప్పడం విశేషం. మొత్తంగా చూస్తే, ఒక సినిమా ఎవరి చేతికి వెళ్తుందో అనే విషయం కేవలం క్యాస్టింగ్ నిర్ణయం మాత్రమే కాదు, అది కెరీర్‌లను మలిచే టర్నింగ్ పాయింట్ కూడా అని ఈ విష‌యం స్ప‌ష్టం చేస్తుంది.