జేడీ మ్యాక్స్ మోడ్.. కొత్త ముచ్చట్లు షురూ!
నటుడిగా, విలన్ గా తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా "జేడీ మ్యాక్స్ మోడ్" అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు.
By: Madhu Reddy | 6 Dec 2025 10:52 AM ISTజే.డీ.చక్రవర్తి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, విలన్ గా తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా "జేడీ మ్యాక్స్ మోడ్" అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు కొత్త ముచ్చట్లతో అభిప్రాయాలను షేర్ చేసుకుంటాను అంటూ ఒక వీడియోతో సహా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..మరి ఈయన ఏం చెప్పబోతున్నారు ? ఆ వీడియోలో ఏముంది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఈ డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా ఖాతా లేనివాళ్లు ఎవరైనా ఉన్నారంటే నమ్మగలమా? ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా కూడా సామాజిక మాధ్యమాల పైనే నడుస్తోంది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే రోజులు వచ్చేసాయి. సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు అనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సోషల్ మీడియా ద్వారా ఒక్కరోజులోనే ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. మరి అంతలా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వని ఒక నటుడు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. ఆయన ఎవరో కాదు జేడీ.చక్రవర్తి. తాజాగా ఇన్స్టా లోకి ఎంట్రీ ఇస్తూ ఒక వీడియోని కూడా పంచుకున్నారు.
విషయంలోకి వెళ్తే.. జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. "జేడీ మ్యాక్స్ మోడ్" అనే పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్ ని ఆయన బృందం ఓపెన్ చేశారు. ఇందులో జేడీకి సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ.." నేను దేవుడిని నమ్మను.. మీరు వినేది నిజమే. కానీ నేను దేవుళ్లను నమ్ముతాను. అంత కక్కుర్తి ఎందుకు.. ఒకటి రెండు దేవుళ్లను మాత్రమే నమ్మడానికి.. కాబట్టి నేను అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నాను.." అంటూ జేడీ చక్రవర్తి ఆ వీడియోలో మాట్లాడారు.
పైగా కింద క్యాప్షన్ లో "ఒపీనియన్ కి ఫ్రీడమ్ ఉంది. కానీ దైవత్వానికి హద్దులు ఉన్నాయి" అంటూ క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూస్తుంటే జేడీ మ్యాక్స్ మోడ్ ద్వారా సరికొత్త ముచ్చట్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దైవత్వాన్ని ఇక్కడ హైలెట్ చేస్తున్నారు అంటే డివోషనల్ కి సంబంధించిన విషయాలపైనే జెడి స్పందించబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ మాక్స్ మోడ్ ద్వారా జేడీ ఏం చెప్పబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
జేడీ చక్రవర్తి విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనలో మార్క్ చూపించిన ఈయన ఆ తర్వాత హీరోగా కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు జేడీ చక్రవర్తి.
