అండర్ వేర్‌తో రోడ్డుపై హీరో పరుగులు..!
తాజాగా జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కృష్ణవంశీతో ఒకానొక సమయంలో మాట్లాడుతున్న సమయంలో నటుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతూ ఉండేవాడు.
By: Ramesh Palla | 15 Aug 2025 3:00 PM ISTహీరోగా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు జేడీ చక్రవర్తి. ఈయన కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. హీరోగా చేస్తున్న సమయంలోనూ ఈయన విలన్ పాత్రలు చేయడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. జేడీ చక్రవర్తి కెరీర్ ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా చేసేవాడు. అప్పటి నుంచి వర్మ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు చేశాడు. వర్మ శిష్యులతోనూ జేడీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే గులాబీ సినిమా ను కృష్ణవంశీ దర్శకత్వంలో చేశాడు. ఇద్దరికీ వర్మ వద్ద ఉన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ చాలా మంచి స్నేహితులుగా కొనసాగినట్లు వారి వారి ఇంటర్వ్యూలను చూస్తే అర్థం అవుతుంది.
కృష్ణవంశీతో జేడీ చక్రవర్తి
తాజాగా జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కృష్ణవంశీతో ఒకానొక సమయంలో మాట్లాడుతున్న సమయంలో నటుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతూ ఉండేవాడు. నటుడు కావాలి అనుకునే వాడు చాలా ఓపెన్‌గా ఉండాలి అనేవాడు, రామ్ గోపాల్ వర్మ వద్ద మేము ఇద్దరం ఉండేవాళ్లం. ఆ సమయంలో చాలా క్లోజ్ అయ్యాం. గులాబీ సినిమాకు ముందు మేము ఇద్దరం ఒక సినిమా పని నిమిత్తం ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లాం. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ బయట నేను, కృష్ణవంశీ మాట్లాడుకుంటూ ఉండగా కెరీర్ గురించి చర్చ మొదలైంది. అప్పుడే కృష్ణవంశీ నటుడు అంటే చాలా ఇంటెన్స్ ఉండాలి. నటన కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్టుగా ఉండాలి. అలాంటి వారు నటనలో ఖచ్చితంగా రాణిస్తారు అంటూ కృష్ణవంశీ చెప్పాడట.
గులాబీ సినిమాకు ముందు మాట
కృష్ణవంశీ మాటలు పూర్తి కాకముందే జేడీ చక్రవర్తి లో దుస్తులు మాత్రమే ఉంచుకుని రోడ్డు పై పరిగెత్తడం మొదలు పెట్టాడట. కృష్ణవంశీ అటు నుంచి ఇటు చూసేప్పటికి అప్పటికే జేడీ పరుగు లంకించుకున్నాడు. నాలో ఉన్న ఆ డెడికేషన్‌కి అంతా కూడా షాక్ అయ్యారు. కృష్ణవంశీ పూర్తిగా నన్ను నమ్మి గులాబీ సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఆ సినిమా కోసం ఇద్దరం చాలా కష్టపడ్డాం. యాక్టింగ్ అంటే నాకు ఉన్న ఆసక్తిని గమనించిన కృష్ణవంశీ అందుకు తగ్గట్టుగా మంచి పాత్రను ఇవ్వడం వల్లే నాకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది అన్నట్లుగా జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చినా కూడా కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి చాలా విభిన్నంగా ఉంటారు. ఆయన మార్క్ సినిమాలకు వీరిద్దరూ దూరంగా ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.
జేడీ చక్రవర్తి విలన్‌గా...
జేడీ చక్రవర్తి ఎన్నో ఫ్యామిలీ డ్రామాలను చేయడంతో పాటు, కామెడీ ఎంటర్‌టైనర్‌లను చేయడం జరిగింది. ఇప్పటికీ ఈయన సినిమాలు, సిరీస్‌లను చేయడం ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జేడీ చక్రవర్తి యొక్క సినిమా సీన్స్, పాటలు వైరల్ అవుతూనే ఉంటాయి. జేడీ యాక్టింగ్ చాలా సింపుల్‌గా ఉంటుందని, ఆయన యాక్టింగ్ చేస్తూ ఉంటే యాక్ట్ చేసినట్లుగా కాకుండా నేచురల్‌గా ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. జేడీ వంటి నటులు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి మరిన్ని సినిమాలు చేయాలని, విలన్‌గానూ సినిమాలు చేయడం ద్వారా మరింత మందికి ఈయన సినిమాలు చేరువ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చాలా మంది సీనియర్ హీరోల విలన్ పాత్రలు చేస్తున్నారు. కనుక జేడీ సైతం అలాంటి పాత్రలు చేయడం ద్వారా మరింతగా ప్రేక్షకులకు ఆయన చేరువ కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
