Begin typing your search above and press return to search.

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తన నటనతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   4 Nov 2026 2:45 PM IST
హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!
X

సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తన నటనతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె చేసిన సినిమాలు, పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో జయసుధ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అరవింద్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అల్లు అరవింద్ అంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా అందరికీ గుర్తొస్తారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అయితే ఆయనలో చాలా మంచి నటుడు కూడా ఉన్నారు అని.. జయసుధ చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఎప్పటినుంచో అల్లు అరవింద్ కి తను.. సినిమాలో నటించమని చెప్పే దాన్ని అని.. అల్లు అరవింద్ చాలా మంచి నటుడు అని.. జయసుధ తెలియజేశారు. “నేను హీరోయిన్‌గా, అల్లు అరవింద్ హీరోగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఒక సినిమా తెరకెక్కించాలి అనుకుంటున్నా.. ఆ సినిమాకీ పేరు రోమన్ హాలిడే అని పెట్టవచ్చు,” అని తమాషాగా తెలిపారు చేసిన.

సాధారణంగా అల్లు అరవింద్ పేరు వినగానే నిర్మాతగానే గుర్తుకొస్తారు. ఆయన తండ్రి అల్లు రామలింగయ్య తెలుగు సినిమాల్లో ప్రముఖ హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనతో ఎన్నో సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్ , అల్లు శిరీష్ ఇద్దరూ కూడా హీరోలగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమ అల్లు అరవింద్ మాత్రం హీరోగా మారలేదు. గీతా ఆర్ట్స్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. ఆయన నిర్మించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

ఈ క్రమంలో జయసుధ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు వాయిదాలు అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.