బాలకృష్ణ డెడికేషన్ నేటితరానికి స్ఫూర్తి: జయసుధ
ముఖ్యంగా నందమూరి వంశంలో తరతరాల నటులతో కలిసి పని చేసే అవకాశం ఈ సీనియర్ నటి అందుకున్నారు.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:28 PM ISTసహజనటి జయసుధ తరాల నటులతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నందమూరి వంశంలో తరతరాల నటులతో కలిసి పని చేసే అవకాశం ఈ సీనియర్ నటి అందుకున్నారు. విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ తో, అలాగే ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించారు జయసుధ. నందమూరి వంశంలోని వారసులందరితోను కలిసి నటిస్తున్నారు.
ఇదే విషయాన్ని 50 సంవత్సరాలుగా హీరోగా ఏల్తున్న నందమూరి బాలకృష్ణ కు సన్మాన కార్యక్రమంలో జయసుధ గుర్తు చేసుకున్నారు. సహజనటి జయసుధ మాట్లాడుతూ..``బాలయ్యబాబు సన్మానంలో నేను పాల్గొనటం ఆనందంగా ఉంది. ఆయన నటుడిగానే కాదు, వ్యక్తిగానూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆకర్షిస్తారు. నేను ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ తోను వైవిధ్యమైన పాత్రల్లో నటించాను. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్ కు స్పూర్తి. ఆయన యూకే రికార్డులే కాదు... ఇంకా మరిన్ని రికార్డ్స్ అందుకోవాలి`` అని అన్నారు.
ఎన్టీఆర్ సినిమాల్లో కథానాయికగా నటించిన సహజనటి జయసుధ ఎన్బీకే నటించిన చాలా సినిమాల్లో అద్భుతమైన సహాయ పాత్రల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. నేటి సాయంత్రం ఎన్బీకే సన్మాన కార్యక్రమంలో జయసుధ ఎంతో హృదయపూర్వకంగా, బాలయ్యపై ప్రశంసలు కురిపించారు.
