Begin typing your search above and press return to search.

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

సాధారణంగా చాలామందికి చెట్టు ఎక్కడం, దిగడం అలవాటుగానే ఉంటుంది. అయితే ఆ విషయాన్ని సందర్భాన్ని బట్టి బయటపెడుతూ ఉంటారు.

By:  Madhu Reddy   |   4 Nov 2026 12:00 AM IST
ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్
X

సాధారణంగా చాలామందికి చెట్టు ఎక్కడం, దిగడం అలవాటుగానే ఉంటుంది. అయితే ఆ విషయాన్ని సందర్భాన్ని బట్టి బయటపెడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక హీరోయిన్ తనకు చిన్నప్పుడు చెట్టు ఎక్కడమన్నా , దిగడమన్నా చాలా ఇష్టమట. అదే అలవాటులో ఆమె మరచిపోయి , పిల్లలు పెళ్లీడుకొచ్చాక 50 ఏళ్ల వయసులో చెట్టు ఎక్కారట. అయితే ఎక్కడం వరకు పరవాలేదు కానీ దిగడం ఎలా.. ఒకప్పుడు చెట్టు ఎక్కి దిగి బాగా అలవాటుపడ్డ ఆ నటి 50 ఏళ్ల వయసులో అదే అలవాటుతో సులభంగా పైకి ఎక్కగలిగారు. కానీ దిగడం మాత్రం మరిచిపోయారట. దీంతో ఆరోజు జరిగిన సంఘటన గురించి తాజాగా ఆమె చెప్పి అందరిని నవ్వించారు మరి ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణి జయసుధ.

ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె.. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోలకు, హీరోయిన్లకు అమ్మమ్మగా, నాన్నమ్మగా నటిస్తూ మరింత ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ 'సమ్మర్ హాలిడేస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు ఫ్యామిలీ డ్రామాగా నవంబర్ 6వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇది. విదేశీ ప్రీమియర్లో నవంబర్ 5వ తేదీనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

శ్రీకర్ నయన్.జీ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జయసుధ ,రాజీవ్ కనకాల, వాసుకి , రోహన్ రాయ్ గుంటి, అరుణ్ దేవ్, ఖుషి సోనీ, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2000వ సంవత్సరం నేపథ్యంలో సాగే ఈ కథ.. గోదావరి గ్రామంలోని తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవి సెలవులకు వెళ్లిన ఒక నగర బాలుడి చుట్టూ తిరుగుతుంది. ఇకపోతే విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న జయసుధ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

"మేము పిల్లలుగా ఉన్న రోజుల్లో చెట్లు ఎక్కడం, దిగడం, కింద పడడం, దెబ్బలు తగలడం అన్నీ మామూలే. అయితే ఇంట్లో పెద్దవాళ్లు కొట్టేవారు కాదు కానీ బాగా తిట్టేవారు. తిడతారనే భయంతో చెప్పకుండా దాస్తే మరుసటి రోజు సెప్టిక్ అయిపోయి.. డాక్టర్ దగ్గరకు వెళ్తే టీటీ ఇంజక్షన్ ఇచ్చేవారు. అలాంటి నేను చాలా ఏళ్ల తర్వాత..మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అయితే ఒకసారి నేను మర్చిపోయి చెట్టెక్కేసాను. అప్పటికే నా వయసు 50 ఏళ్ళు. ఇదంతా జరిగింది కూడా హైదరాబాదులోనే. చెట్టయితే ధైర్యంగా ఎక్కేసాను కానీ దిగడం రాలేదు" అంటూ తనకు ఎదురైనా సంఘటనను ప్రమోషన్స్లో చెప్పి అందరిని నవ్వించారు.అయితే ఈ ఇన్సిడెంట్ ను సినిమాలో ఎక్కడైనా పెట్టవచ్చేమో చూడండి అంటూ డైరెక్టర్ కి చెప్పారట జయసుధ.

ఇకపోతే చెట్టు ఎక్కిన తర్వాత పక్కన కాంపౌండ్ వాల్ .. ఆ పక్కన మొత్తం ఖాళీ ప్లేస్.. అక్కడేదో ఉంటే చూడడం కోసమే నేను చెట్టు ఎక్కాను.కానీ దిగడం రాలేదు. భయపడ్డాను. చాలాసేపు పిలిచాను. కానీ ఎవరూ రాలేదు. జూబ్లీహిల్స్ లో ఎక్కడో లోపల ఉంది అది. చాలాసేపు అరిచిన తర్వాత పనమ్మాయి వచ్చింది. ఈమె ఎందుకు చెట్టెక్కింది అనే రేంజ్ లో ఆమె నన్ను చూసింది. ఇక తర్వాత ఏదో మేనేజ్ చేసి దిగేసాను" అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరిని నవ్వించారు జయసుధ.