Begin typing your search above and press return to search.

17 ఏళ్ల త‌ర్వాత జ‌య‌ప్ర‌ద కంబ్యాక్!

జయప్రదకు బెంగాలీ చిత్ర పరిశ్రమతో ఎంతో కాలం నాటి అనుబంధం ఉంది. గతంలో ఆమె నటించిన బెంగాలీ సినిమాలు అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 12:01 PM IST
17 ఏళ్ల త‌ర్వాత జ‌య‌ప్ర‌ద కంబ్యాక్!
X

చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన.. అసమాన సౌందర్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జయప్రద. తెలుగు, హిందీ చిత్రాలలో అగ్ర కథానాయికగా వెలిగిన జ‌య‌ప్ర‌ద‌ తమిళం, కన్నడ, మలయాళం , బెంగాలీ భాషల్లోనూ నటించి పాన్-ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు. రాజ‌కీయాల్లో సైతం ంత‌న‌దైన ముద్ర వేసారు. రాజ‌కీయాలు- సినిమాలు రెండింటిని ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేసిన సీనియ‌ర్ గా జ‌య‌ప్ర‌ద‌కు మంచిపేరుంది. ప్ర‌స్తుతం సినిమాల్లో కొన‌సాగుతున్నారు. ఏ భాష‌లో అవ‌కాశం వ‌స్తే అక్క‌డ న‌టిస్తున్నారు. మంచి అవ‌కాశాలు వ‌స్తే బుల్లి తెర‌ను సైతం కాద‌నుకుండా ప‌ని చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా 17 ఏళ్ల త‌ర్వాత బెంగాలీ ఇండ‌స్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. ఓ సరికొత్త బెంగాలీ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ‌య‌ప్ర‌ద‌ కోల్‌కతా చిత్ర పరిశ్రమలో మరోసారి నటనను ప్రదర్శించనున్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాలకు -బలమైన కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బెంగాలీ సినిమాలో జ‌య‌ప్ర‌ద పాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని .. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతోనే అంగీకరించినట్లు తెలుస్తోంది.

జయప్రదకు బెంగాలీ చిత్ర పరిశ్రమతో ఎంతో కాలం నాటి అనుబంధం ఉంది. గతంలో ఆమె నటించిన బెంగాలీ సినిమాలు అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగాలీ సంస్కృతిని, అక్కడి భాషా శైలిని ఆమె ఎంతో గౌరవిస్తారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే వంటి వారు సైతం జయప్రదను భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత అందమైన నటిగా కొనియాడిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండటంతో పాత జ్ఞాపకాలు మరోసారి గుర్తుకొస్తున్నాయి.

ప్రస్తుతం బెంగాలీ సినిమా వైవిధ్యమైన కథలతో దూసుకుపోతోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథాంశాలు, బల మైన పాత్రలు నేటి తరం దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇలా మారుతున్న సినీ వాతావరణంలో జయప్రద లాంటి అనుభవజ్ఞురాలైన నటి భాగం కావడం చిత్రానికి సరికొత్త హంగులను తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. సీనియర్ నటీనటులకు తగిన రీతిలో పవర్ ఫుల్ పాత్రలను సృష్టించడంలో బెంగాలీ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. జయప్రద ఇత‌ర వ్యాపారాల్లో బిజీగా ఉన్నా? నటనపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదని తాజా నిర్ణయంతో మ‌రోసారి నిరూపిత‌మైంది.

జయప్రద బెంగాలీ చిత్ర పరిశ్రమలోకి తిరిగి రావడం అనేది కేవలం అభిమానులకే కాదు .బెంగాలీ సినీ ప్రియులకు కూడా మంచి శుభవార్త. ఆమె రాకతో ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. వెండితెరపై ఆమె మళ్లీ తన నటనతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో? చూడాలని ఇండస్ట్రీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ కొత్త ప్రయాణం ఆమెకు మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షిద్దాం.