Begin typing your search above and press return to search.

ఘట్టమనేని వారసుడి కోసం మహేష్ రంగంలోకి దిగుతారా?

ఆ యాంగిల్ లో చూస్తే జయకృష్ణకు శ్రీనివాస మంగాపురం సాధారణ తొలి సినిమా కాదు. ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన కొత్త తరం హీరోగా ఆయన ఎలా నిలబడతారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 July 2026 10:28 PM IST
ఘట్టమనేని వారసుడి కోసం మహేష్ రంగంలోకి దిగుతారా?
X

టాలీవుడ్ లో స్టార్ కుటుంబాల నుంచి కొత్త హీరోలు పరిచయం కావడం కొత్త విషయం కాదు. అయితే ప్రతి తరం ఆడియ‌న్స్ అంచనాలు మారుతున్న కొద్దీ, వారసులపై ఉండే ప్రెజ‌ర్ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తదానీ కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటంతో, ఇది ఇద్దరు స్టార్ కిడ్స్‌కు కీలకమైన తొలి అడుగుగా మారింది.

టాలీవుడ్ హిస్ట‌రీని పరిశీలిస్తే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ లాంటి స్టార్ వారసులు తమ తొలి సినిమాల సమయంలోనే భారీ అంచనాలను ఎదుర్కొన్నారు. కొందరికి డెబ్యూ సినిమానే మంచి స‌క్సెస్ ను అందించగా, మరికొందరు తరువాతి సినిమాల‌తో తమ స్థానాన్నిబలపరుచుకున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఆడియ‌న్స్ లో మొద‌ట్లో ఇంట్రెస్ట్ ను పెంచగలదు కానీ, లాంగ్ ర‌న్ స‌క్సెస్ ను డిసైడ్ చేసేది మాత్రం యాక్టింగ్, స్టోరీ సెలెక్ష‌న్ మ‌రియు ఆడియ‌న్స్ ఆద‌ర‌ణే.

ఆ యాంగిల్ లో చూస్తే జయకృష్ణకు శ్రీనివాస మంగాపురం సాధారణ తొలి సినిమా కాదు. ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన కొత్త తరం హీరోగా ఆయన ఎలా నిలబడతారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అదే సమయంలో రషా తదానీకి కూడా తెలుగు మార్కెట్‌లో తొలి ముద్ర వేయాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లకు కీలక పరీక్షగా మారింది.

ఇలాంటి నేపథ్యంలో సినిమా ప్రమోష‌న్స్ కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న హీరో కావ‌డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉందనే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టే రీసెంట్ గా డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి కూడా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో మ‌హేష్ పాల్గొనే అవ‌కాశాలున్నాయ‌ని హింట్ ఇచ్చారు. అదే జ‌రిగితే ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరగడంతో పాటు సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రా డిస్క‌ష‌న్ దారితీయొచ్చు. ముఖ్యంగా రిలీజ్‌కు ముందు ఏర్పడే బజ్ ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్‌పై సానుకూల ప్రభావం చూపే అవకాశాన్ని ట్రేడ్ వర్గాలు కూడా కొట్టిపారేయడం లేదు.

అయితే చివరికి స్టార్ సపోర్ట్ ఎంత ఉన్నా, ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ మళ్లీ రప్పించేది సినిమా కంటెంట్ మాత్రమే. అందుకే శ్రీనివాస మంగాపురంకు ప్రమోష‌న‌ల్ హైప్‌తో పాటు, జయకృష్ణ మరియు రషా తమ తొలి అవకాశాన్ని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటారన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశంగా మారింది.