నమ్రత పిన్ని మాత్రమే కాదు.. సూపర్ సపోర్ట్ సిస్టమ్ అంట..
అలాంటి సమయంలో ఫ్యామిలీలో అందరితో టచ్ లో ఉంటూ, వారి గురించి తెలుసుకుంటూ ఉండేది పిన్ని నమ్రతే" అని జయకృష్ణ తెలిపారు.
By: M Prashanth | 24 July 2026 11:43 AM ISTఘట్టమనేని ఫ్యామిలీ నుంచి నమ్రతా శిరోద్కర్ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది మహేష్ బాబు భార్యగానే. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు వింటే.. ఆమె రోల్ లో అక్కడితో కంప్లీట్ అవ్వదని అర్థమవుతోంది. కుటుంబాన్ని ఒక్క తాటిపై ఉంచడం నుంచి, కొత్త జెనరేషన్ కు గైడ్ చేయడం వరకు నమ్రత ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తాజాగా యంగ్ హీరో జయకృష్ణ ఘట్టమనేని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ప్రస్తుతం తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన తన పిన్ని నమ్రత గురించి చెప్పిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. "బాబాయ్ ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో ఫ్యామిలీలో అందరితో టచ్ లో ఉంటూ, వారి గురించి తెలుసుకుంటూ ఉండేది పిన్ని నమ్రతే" అని జయకృష్ణ తెలిపారు.
తాను తరచూ నమ్రతతో మాట్లాడుతుంటానని, ఆమె ఎప్పుడూ తనకు అండగా నిలుస్తారని వెల్లడించారు. ముఖ్యంగా నటుడిగా ఎదగాలనే టార్గెట్ తో ముంబైకి వెళ్లిన సమయంలో నమ్రత ఇచ్చిన సజెషన్స్ తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. ముంబైలో ఎవరిని కలవాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఇండస్ట్రీలో అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలి? వంటి విషయాల్లో తనకు గైడ్ చేశారని గుర్తు చేసుకున్నారు.
అయితే నమ్రత ముంబై బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వ్యక్తి కావడం, బాలీవుడ్ తో పాటు మోడలింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉండటం జయకృష్ణకు హెల్ప్ అయిందని టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో సరైన దిశలో వెళ్లడం ఎంత ముఖ్యమో తెలిసిన నమ్రత, కుటుంబ సభ్యులకు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉంటారని అంటున్నారు. నిజానికి ఘట్టమనేని ఫ్యామిలీలో నమ్రత పాత్ర గురించి గతంలోనూ పలు సందర్భాల్లో చర్చ జరిగింది.
మహేష్ బాబు సినిమా వ్యవహారాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, సామాజిక సేవా కార్యక్రమాలు చూసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో క్లోజ్ గా ఉండటం ఆమె ప్రత్యేకతగా చెబుతుంటారు. ఇప్పుడు జయకృష్ణ కామెంట్స్ తో ఆమె ఫ్యామిలీతో ఎంత దగ్గరగా ఉంటారో మరోసారి స్పష్టమైంది. జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో కూడా నమ్రత ప్రోత్సాహం అందించారని సమాచారం.
ఆయన లుక్స్, కెరీర్ సెలక్షన్ల విషయంలో తన అభిప్రాయాలను పంచుకోవడమే కాకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేలా మాట్లాడారని తెలుస్తోంది. అంతేకాదు, శ్రీనివాస మంగాపురం టీజర్, పాటలు చూసిన తర్వాత కూడా ఆమె సంతోషం వ్యక్తం చేసినట్లు జయకృష్ణ తెలిపారు. సినీ కాంపౌండ్స్ లో వారసుల ఎంట్రీలు కొత్త విషయం కాదు. కానీ, అలాంటి సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ కీలకం. జయకృష్ణ కామెంట్స్ బట్టి చూస్తే.. నమ్రత ఆయనకు కేవలం పిన్ని మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చే మెంటర్, ప్రతి అడుగులో ధైర్యం చెప్పే సపోర్ట్ సిస్టమ్. అందుకే ఘట్టమనేని కుటుంబంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
