Begin typing your search above and press return to search.

బుర్రిపాలెంతో ఘట్టమనేని వారసుడి బాండింగ్ ఎలా ఉంది?

తన విలేజ్ డెవలప్మెంట్ కు అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, అక్కడి ప్రజలతో ఫ్యామిలీ మెంబర్ లా మెలిగేవారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

By:  M Prashanth   |   24 July 2026 11:43 AM IST
బుర్రిపాలెంతో ఘట్టమనేని వారసుడి బాండింగ్ ఎలా ఉంది?
X

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి బుర్రిపాలెం అంటే కేవలం సొంతూరు మాత్రమే కాదు.. అది ఓ ఎమోషన్. దశాబ్దాలుగా ఆ గ్రామంతో ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్ రిలేషన్ ఉంది. నిజానికి కృష్ణ తన సినీ కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా, బుర్రిపాలెంపై ఉన్న ప్రేమను ఎప్పుడూ తగ్గించుకోలేదు. తన విలేజ్ డెవలప్మెంట్ కు అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, అక్కడి ప్రజలతో ఫ్యామిలీ మెంబర్ లా మెలిగేవారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

ఇప్పుడు అదే రిలేషన్ ను కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కొనసాగిస్తున్నారు. తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రమోషన్లను బుర్రిపాలెం నుంచే ప్రారంభించడం వెనుక కూడా ఇదే ఎమోషన్ కనిపిస్తోంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జయకృష్ణ.. బుర్రిపాలెంతో తనకున్న రిలేషన్ ను గుర్తు చేసుకున్నారు. "బుర్రిపాలెంలో మా కుటుంబ ఆస్తులన్నీ వెళ్లి చూశాను. అక్కడి ప్రజలు తాతయ్య కృష్ణ గారు తమకు ఎంతో సహాయం చేశారని చెప్పారు. అందుకే తరచూ వచ్చి కలవాలని నన్ను అడిగారు. వాళ్లు చూపిస్తున్న ప్రేమ చాలా ప్రత్యేకంగా అనిపించింది. అలాంటి అభిమానానికి స్పందించడం నా బాధ్యత" అని జయకృష్ణ పేర్కొన్నారు.

హీరో కావాలన్న ఆలోచన తనకు చిన్నప్పటి నుంచే ఉందని కూడా ఆయన వెల్లడించారు. "16-17 ఏళ్ల వయసులోనే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి అందుకు తగ్గట్టుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మా నాన్న రమేష్ బాబు మరణించిన తర్వాత తాతయ్యే నాకు ధైర్యం చెప్పారు. హీరోగా రాణించగలననే నమ్మకాన్ని ఆయన కల్పించారు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

అయితే ఘట్టమనేని కుటుంబంలో బుర్రిపాలెం సెంటిమెంట్ కొత్తది కాదు. గతంలో మహేష్ బాబు హీరోగా పరిచయమైన రాజకుమారుడు సినిమా ప్రమోషన్స్ కూడా బుర్రిపాలెం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ మూవీ అందరినీ ఆకట్టుకుని మహేష్ కెరీర్‌ లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ ను జయకృష్ణ కూడా కంటిన్యూ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల బుర్రిపాలెం వెళ్లిన జయకృష్ణ.. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి రమేష్ బాబు విగ్రహాలకు నివాళులర్పించారు.

గ్రామ ప్రజల మధ్య ఎద్దుల బండిపై ఊరేగింపుగా వెళ్లి సందడి చేశారు. స్థానికులతో కలిసి మమేకమవుతూ అందరి ప్రశంసలు అందుకున్నారు. అలా జయకృష్ణకు బుర్రిపాలెం కేవలం ఫ్యామిలీ రూట్స్ ఉన్న ఊరు మాత్రమే కాదు. తన తాతయ్య జ్ఞాపకాలు, తండ్రి ఆశయాలు, గ్రామ ప్రజల ప్రేమ కలిసిన ఓ ఎమోషనల్ రిలేషన్. అదే రిలేషన్ ఇప్పుడు ఆయన సినీ జర్నీకి తొలి స్టెప్ గా మారింది. మరి బుర్రిపాలెం సెంటిమెంట్ జయకృష్ణకు కూడా కలిసి వచ్చి, ఘట్టమనేని కుటుంబంలో మరో హీరోగా నిలబెడుతుందా లేదా అన్నది జలై 30వ తేదీన ప్రేక్షకులే తేల్చనున్నారు.