17 ఏళ్లకే సొంత అన్నతో వివాహం.. కట్ చేస్తే!
ఇకపోతే ఆమె ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ అని తెలిసి ఆమెపై పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 22 Sept 2025 12:00 AM ISTచేసుకుందే బాల్య వివాహం.. అందులోనూ సొంత అన్నతో ఏడడుగులు వేసింది అని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..వివాహం చేసుకోవడానికి ఇంకో వ్యక్తి దొరకలేదా అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇకపోతే ఆమె ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ అని తెలిసి ఆమెపై పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు పాకిస్తాన్ నటి జవేరియా అబ్బాసీ.. ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. తన పర్సనల్ లైఫ్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 1997లో ఆమెకు కేవలం 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన సవతి సోదరుడు షమూన్ ను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఈ వివాహంపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కొంతమంది మాత్రం వీరు బయోలాజికల్ సోదర సోదరీమణులు కానందు వల్ల ఈ బంధాన్ని సమర్థించారు.
అయితే ఈ వివాహంపై ఒక ఇంటర్వ్యూలో జవేరియా మాట్లాడుతూ.. "సొంత తల్లి అత్తగా మారి నాపై కఠినంగా వ్యవహరించింది. కానీ సమాజం కోసం ఒక మంచి కోడలిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ సమాజం మమ్మల్ని చూస్తున్న తీరు, మాపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆఖరికి షమూన్ తో విడాకులు తీసుకున్నాను. అప్పటికే మాకు అంజెలా అనే కుమార్తె కూడా జన్మించింది. ఆమెను నేను సింగిల్ మదర్ గానే పెంచుతూ.. నా సంపాదనతోనే అన్ని చూసుకుంటున్నాను" అంటూ తెలిపింది. మొత్తానికైతే జవేరియా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇప్పుడు ఆమె మళ్ళీ వార్తల్లో నిలవడానికి కారణం 51 సంవత్సరాల వయసులో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే 2024లో వ్యాపారవేత్త అడీల్ హైదర్ ను రెండో వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం తన కుమార్తె అంజెలా ప్రోత్సాహమే అని ఆమె తెలిపింది. ఇకపోతే రెండో పెళ్లి విషయంలో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. అభిమానుల నుంచి అత్తవారింటి నుంచి ఆప్యాయత, మద్దతు లభించడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది.. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా పోరాడి.. ఇప్పుడు ఒక మహిళగా తనను తాను ప్రూవ్ చేసుకొని అటు తల్లిగా.. ఇటు భార్యగా, కోడలిగా కూడా తన జీవితాన్ని ఫుల్ ఫిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఏది ఏమైనా బాల్యంలోనే తన సోదరుని వివాహం చేసుకోవడం.. ఆ తర్వాత చిన్న వయసులోనే కూతురికి జన్మనివ్వడం.. మళ్ళీ అతడి నుండి విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని కొనసాగించడం.. ఇప్పుడు లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం అన్ని ఒక కలల జరిగిపోయాయి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
