ఓ స్త్రీ రేపు రా.. లంకె బిందెల పిశాచి.. 'జటాధర' కూడా అలానే: సుధీర్ బాబు
ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పోషించిన 'ధన పిశాచి' పాత్ర గురించి సుధీర్ బాబు స్పెషల్‌గా మాట్లాడారు.
By: M Prashanth | 17 Oct 2025 11:28 PM ISTనవ దళపతి సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయగా, క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ట్రైలర్ అదరగొట్టింది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు మాట్లాడిన మాటలు, సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
సుధీర్ బాబు తన స్పీచ్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "మనందరికీ చిన్నప్పుడు 'ఓ స్త్రీ రేపు రా', ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే లంకె బిందెల కథలు గుర్తున్నాయి కదా.. ఒక నిధిని భూమిలో పాతిపెట్టి, దానికి ఒక పిశాచిని కాపలా పెట్టారనే కథలు విన్నప్పుడు భయంతో పాటు ఒకరకమైన థ్రిల్ కలిగేది. నాకు కూడా ఆ కథలు విన్నప్పుడు అలాంటి ఫీల్ వచ్చేది. ఇప్పుడు, దర్శకుడు వెంకట్ 'జటాధర' కథ చెప్పినప్పుడు కూడా నాకు అచ్చం అలాంటి ఫీలే కలిగింది" అని అన్నారు.
ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పోషించిన 'ధన పిశాచి' పాత్ర గురించి సుధీర్ బాబు స్పెషల్‌గా మాట్లాడారు. "ఈ సినిమాలో సోనాక్షి పెర్ఫార్మెన్స్‌ను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. 'ధన పిశాచి' అనేది చాలా పవర్‌ఫుల్ పాత్ర. దానికి సోనాక్షి తన నటనతో మరింత పవర్‌ను యాడ్ చేశారు. ఇందులో శిల్పా అనే ఆమె క్యారెక్టర్ చూస్తే నిజంగానే భయం వేస్తుంది" అని చెప్పి క్యూరియాసిటీని పెంచేశారు.
ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయమవుతున్న వెంకట్, అభిషేక్‌లకు ఇది ఒక ఫెంటాస్టిక్ డెబ్యూ అవుతుందని సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. "ఈ స్క్రిప్ట్ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో అద్భుతమైన కథతో పాటు, మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి" అని తెలిపారు.
సినిమా అవుట్‌పుట్‌పై తనకున్న నమ్మకాన్ని ఒక మాటలో చెప్పేశారు. "ఈ సినిమా ఒక 'దమ్ బిర్యానీ'లా తయారైంది. ప్రేక్షకుల సమయానికి, డబ్బుకు విలువ ఇచ్చినప్పుడు ఆ సినిమా 100% బ్లాక్‌బస్టర్ అవుతుంది. 'జటాధర' కూడా అలాంటి సినిమానే, కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది" అని ఎంతో కాన్ఫిడెంట్‌గా అన్నారు. ఫైనల్‌గా, ప్రేక్షకులకు ఒక స్వీట్ రిక్వెస్ట్ చేశారు. "నవంబర్ 7న మీ ఇంట్లో ఉన్న అందరినీ థియేటర్‌కు తీసుకురండి. ఈ సినిమా చూశాక, వాళ్లంతా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ గ్యారెంటీ నాది" అని సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు.
