Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు 'జటాధర'.. పవర్ ఫుల్ శిల్పగా శిరోద్కర్..

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు ఇప్పుడు సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  M Prashanth   |   28 Aug 2025 3:00 PM IST
సుధీర్ బాబు జటాధర.. పవర్ ఫుల్ శిల్పగా శిరోద్కర్..
X

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు ఇప్పుడు సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాకు వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్నారు.


పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా సినిమాను రెడీ చేస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌ కుమార్‌ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్‌ నారంగ్, నిఖిల్‌ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్‌ నిర్మిస్తున్నారు. అక్షయ్‌ కేజ్రీవాల్, కుస్సుం అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జటాధర మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటమే సినిమాగా తెలుస్తోంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. ఇద్దరూ తమ తమ పాత్రల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపించారు.

ఆ తర్వాత రీసెంట్ గా నటి దివ్య ఖోస్లా సితార పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సినిమాలోని మరో కీలక పాత్ర శోభను పరిచయం చేశారు మేకర్స్. ఆ రోల్ లో శిల్పా శిరోద్కర్ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శిల్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం అది ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ లుక్ లో ఆమె నల్లటి చీరను ధరించి ఉండగా.. శిల్ప ముందు అగ్నిగుండం ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో దీపాలు ఉండగా.. ఆమె ముందు పుర్రెలు ఉన్నాయి. అయితే పోస్టర్ ద్వారా శిల్ప రోల్ చాలా స్ట్రాంగ్ అని అర్థమవుతోంది. డివోషనల్ పవర్ ను చూపిస్తుంది. ఆమె రోల్ అతీంద్రియ, ఆధ్యాత్మిక స్వరంతో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే శిల్పా శిరోద్కర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన అన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప. ఇప్పుడు ఆమె జటాధరతో సందడి చేయనున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు మంచి ప్రాధాన్యమున్న సినిమాతో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.