Begin typing your search above and press return to search.

జటాధర ఫస్ట్ లుక్: విభిన్న రూపాల్లో సుధీర్ బాబు, సోనాక్షి

టాలీవుడ్‌లో లేటెస్ట్ గా మైథాలజీ సినిమాలకు మంచి రెస్పాన్స్ అందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   4 Aug 2025 1:03 PM IST
Sudheer Babus Jatadhara First look
X

టాలీవుడ్‌లో లేటెస్ట్ గా మైథాలజీ సినిమాలకు మంచి రెస్పాన్స్ అందుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ రూట్లో హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘జటాధర’. సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ను మొదటి నుంచి ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు పలువురు పేరున్న నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా, మైథాలజీ ఆధారంగా ఒక కొత్త కథను అందించనున్న ఈ ప్రాజెక్ట్ టీజర్‌కు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో మరింత హైప్ క్రియేట్ చేసుకుంది.


ఈ సినిమాకు సంబంధించి మొదటిసారి సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్, స్టోరీటెల్లింగ్‌తో పాటు, మైథలజీ ఫాంటసీ కనెక్షన్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తీర్చిదిద్దనున్నట్టు సమాచారం. నిర్మాతల వివరణ ప్రకారం, ఇది మల్టీ లెవెల్ మైథాలజీ యూనివర్స్‌కు ఓ మెయిన్ ట్రెండ్ అని చెబుతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.


రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుధీర్ బాబు లార్డ్ శివుడి భక్తుడిగా త్రిషులం పట్టుకుని ఆకట్టుకున్నాడు. ఫిట్నెస్ విధానం, ఆ పవర్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. వెనుక శివుడి రూపాన్ని పవర్ఫుల్ గా, ఆగ్రహంగా ప్రెజెంట్ చేయగా, అలాగే ఫ్లిప్ వర్షన్‌లో సోనాక్షి సిన్హా ధనపిశాచినిగా అగ్ని సంహారం చేసే విధంగా చూపించడం కాంబినేషన్‌ను మరింత హైలైట్ చేసింది. ఆమె చుట్టూ కాలిన చెట్లు, పాథాళ లోకాన్ని సూచించే క్రియేటివ్ మూడ్‌తో పోస్టర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న మరో ప్రత్యేకత 3ఏమిటంటే మైథాలజీకి మోడ్రన్ టచ్ ఇచ్చేలా క్రాఫ్ట్ చేశారు. పైన భాగంలో శాంతమైన భూలోకాన్ని చూపిస్తే, దిగువ భాగంలో పాతాళ లోకాన్ని భయంకరంగా చూపించడం స్టోరీకి కొత్త రక్తాన్ని పోస్తోంది. దర్శకులు విజువల్‌గా కథను చెప్పే విధానం, పాత్రల ప్రెజెంటేషన్ సినిమాపై మౌత్ టాక్ పెంచింది. ఇక మేకర్స్ ఆగస్టు 8న టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. వీఎఫ్‌ఎక్స్, AI ఆధారిత టెక్నాలజీతో సినిమా విజువల్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారట.

ఆడియో, మ్యూజిక్ కోసం ప్రముఖ కంపెనీలు కలిసి పని చేస్తున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ టీమ్‌లో టాప్ టాలెంట్ పనిచేస్తుండటంతో ఇండస్ట్రీలో ‘జటాధర’ని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ, ఫస్ట్ లుక్, టీజర్ ప్రమోషన్స్ చూస్తే ఆసక్తి రెట్టింపు అవుతోంది. సుధీర్ బాబు సోనాక్షి కాంబో, విజువల్స్, మైథాలజీ నేపథ్యం, క్రియేటివ్ టచ్ సినిమాకు స్పెషల్ హైప్ తెచ్చిపెట్టాయి.