Begin typing your search above and press return to search.

'ఆశీర్వదించు.. సిరి సంపదలిచ్చు'.. సోనాక్షి సిన్హా 'జటాధర' ఉగ్రరూపం!

ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ధన పిశాచి సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రతి అదృష్టం వెనుక ఒక చీకటి రహస్యం దాగి ఉందంటూ రాసుకొచ్చారు.

By:  M Prashanth   |   1 Oct 2025 3:12 PM IST
ఆశీర్వదించు.. సిరి సంపదలిచ్చు.. సోనాక్షి సిన్హా జటాధర ఉగ్రరూపం!
X

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కూడా స్పెషల్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు తెలుగులో జటాధర మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు సోనాక్షి సిన్హా.

ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సినిమాకు ఆమెకు సంబంధించిన సాంగ్ ధన పిశాచి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ సమయంలో స్పెషల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. అందరిలో ఆసక్తి రేపింది.

ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ధన పిశాచి సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రతి అదృష్టం వెనుక ఒక చీకటి రహస్యం దాగి ఉందంటూ రాసుకొచ్చారు. వేద అకరి.. భూత అహరి.. సూన్య సంచారి అంటూ సాగిన పాటకు శ్రీహర్ష ఈమని లిరిక్స్ అందించారు. సాహితి చాగంటి తన పవర్ ఫుల్ వాయిస్ తో ప్రాణం పోశారు.

సమీరా కొప్పికర్ కంపోజ్ చేసిన ధన పిశాచి పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే బీట్ తో మెప్పిస్తోంది. సాంగ్ లో సోనాక్షి సిన్హా చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. ఎనర్జిటిక్ స్టెప్స్ తో అలరించారు. తన ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేశారు. ఓవరాల్ గా తన ఉగ్రరూపాన్ని ధన పిశాచి పాటలో చూపించారనే చెప్పాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ గా జటాధర రూపొందుతోంది. అభిషేక్ జైస్వాల్ వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో పాటు ఉమేశ్ కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో కలిసి దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ.. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.