పవర్‌స్టార్ వారసుడు ఆరడుగుల బుల్లెట్టు
అదంతా అటుంచితే, అటు కోలీవుడ్ పవర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతూ నటనకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దళపతి లెగసీని ముందుకు నడిపించే వారసుడొస్తున్నాడు!
By: Sivaji Kontham | 7 Sept 2025 12:13 PM ISTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అఖీరా నందన్ ఒడ్డు పొడుగు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వారే, పవన్ వారసుడి ఎత్తు, ఛరిష్మాను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అఖీరా నందన్ దాదాపు ఆరడుగుల బుల్లెట్టులా ఉన్నాడు. అఖీరా తొందర్లోనే హీరో అవుతాడని పవన్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అదంతా అటుంచితే, అటు కోలీవుడ్ పవర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతూ నటనకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దళపతి లెగసీని ముందుకు నడిపించే వారసుడొస్తున్నాడు! అంటూ మరోవైపు గుసగుసలు మొదలయ్యాయి. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ పై ఇప్పుడు అందరి ఫోకస్ మళ్లింది. కోలీవుడ్ లో దళపతి వారసత్వాన్ని ముందుకు నడిపించే ఏకైక వారసుడు! అంటూ ఇటీవల ప్రచారం హోరెత్తుతోంది. జన నాయగన్ చిత్రీకరణ పూర్తయ్యాక విజయ్ పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతుంటే, ఈ టీనేజీ కుర్రాడిపైకి అందరి ఫోకస్ మారింది.
ఈ ఇద్దరికే పోటాపోటీ:
అయితే జాసన్ సంజయ్ లుక్ ఎలా ఉంది? అంటే.. దానికి సమాధానం ఈ ఫోటోగ్రాఫ్. విజయ్ భార్య సంగీత సోర్నలింగం, కుమారుడు జాసన్ సంజయ్ నిన్న చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. చేతిలో కాఫీ పట్టుకుని తల్లీకొడుకులు నడుస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాసన్ సంజయ్ కూడా అఖీరా నందన్ తరహాలోనే ఆరడుగుల బుల్లెట్టులా ఉన్నాడు. దీంతో టాలీవుడ్ పవర్ స్టార్ వారసుడితో కోలీవుడ్ పవర్ స్టార్ వారసడిని పోల్చి చూస్తున్నారు. భవిష్యత్ లో ఈ ఇద్దరూ నటనా రంగంలో అడుగుపెడితే, స్టార్లుగా ఒకరితో ఒకరు పోటీపడతారని కూడా అంచనాలు వేస్తున్నారు.
ప్రేమ వివాహం:
దళపతి విజయ్ - సంగీత సోర్నలింగం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1999 లో ఈ జంట వివాహం అయింది. సంగీత శ్రీలంకకు చెందిన తమిళురాలు. విజయ్ కి వీరాభిమాని. అతడిని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడింది. తర్వాత అతడినే పెళ్లాడింది. ఈ స్టార్ కపుల్ కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు దివ్య సాషా. జాసన్ సంజయ్ కూడా షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ లా మొదట దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. దళపతి విజయ్ చిట్టచివరి చిత్రం జననాయగన్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది.
