ఏకంగా సూపర్ స్టార్ కే గురి పెట్టిన వారసుడు!
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
By: Srikanth Kontham | 21 Sept 2025 10:27 PM ISTదళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ మేకింగ్ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. జాసన్ లాంచింగ్ మూవీ కావడంతో? మంచి బజ్ ఉన్న చిత్రంగా హైలైట్ అవుతోంది. అయితే జాసన్ డెబ్యూ ఓ తెలుగు నటుడితో కావడం విశేషం. కోలీవుడ్ లో ఎంతో మంది హీరోలున్నా? వారందర్నీ కాదని సందీప్ తో ముందకెళ్లడం ఆసక్తికరంగా. ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
మరి తదుపరి జాసన్ ప్రణాళిక ఎలా ఉంది? అంటే యువ సంచలనం ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కే గురిపె ట్టినట్లు తెలుస్తోంది. ఓ రెండు మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకుని రజనీకాంత్ తో సినిమా చేయాలని చూస్తున్నాడని తెలిసింది. జాసన్ కి రజనీకాంత్ తో ఛాన్స్ పెద్ద విషయం కాదు. కానీ తానేంటన్నది ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇది జరుగుతుంది. ప్రతిభావంతులైన కొత్త వారికి అవకాశాలివ్వడానికి రజనీ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఎవరుంటారా? అని రజనీ ప్రత్యేకంగా సెర్చ్ చేస్తుంటారు.హిట్ అయిన దర్శకుల జాబితా తీసుకుని వాళ్లలో ది బెస్ట్ ఎవరు? అన్నది చూసి పిలిచి మరీ ఛాన్స్ ఇస్తుంటారు.
`జై భీమ్` దర్శకుడు టి.జె జ్ఞాన్ వేల్ `వెట్టేయాన్` తో అలా ఛాన్స్ అందుకున్న వారే. లోకేష్ కనగరాజ్ కి `కూలీ` అలాగే అవకాశం వచ్చింది. అలా చూసుకుంటే జాసన్ కి రజనీ తో ఛాన్స్ పెద్ద విషయం కాదు. తొలి సినిమాతో హిట్ అందుకుంటే? ఒక్క ఫోన్ కాల్ తో రజనీని కలిసి స్టోరీ నేరేట్ చేయోచ్చు. నచ్చిదంటే? కలిసి పనిచేద్దాం అనే మాటకు పెద్దగా సమయం పట్టదు.
జాసన్ సంజయ్ రైటింగ్, డైరెక్షన్ కి సంబంధించి ప్రఖ్యాత విదేశీ ఫిలిం ఇనిస్ట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. లండన్ లో స్క్రీన్ రైటింగ్ గ్రాడ్యూషన్ పూర్తి చేసాడు. అటుపై కెనడాలోని ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాడు. డాడ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలకు డైరక్షన్ విభాగంలోనూ పని చేసాడు. ఇదే అనుభవంతో? సందీప్ కిషన్ తో ఛాన్స్ అందుకున్నాడు. సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికే 30 సినిమాలకు పని చేసాడు. తన 31వ చిత్రాన్ని జాసన్ తో పట్టాలెక్కించాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళ సినిమాలకు సమయం కేటాయిస్తున్నాడు.
