జేసన్ కు తెగ నచ్చేసింది.. మరి 'సిగ్మా'లో సందీప్ కిషన్ సంగతేంటో..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
By: M Prashanth | 6 July 2026 10:04 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ లో నటించిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ కు సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న వేళ.. యువ దర్శకుడు జేసన్ సంజయ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం సందీప్ కిషన్ తో ఆయన సిగ్మా సినిమా తెరకెక్కించడమే.
సూపర్ సుబ్బు సిరీస్ ను చూసిన జేసన్ సంజయ్.. తనకు బాగా నచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సందీప్ కిషన్ తో పాటు సిరీస్ టీమ్ కు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. సిరీస్ ను పూర్తిగా ఆస్వాదించానని, క్యాస్టింగ్ యాక్టింగ్ తో పాటు ఎంచుకున్న జానర్ కు కట్టుబడి కథను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఆ సిరీస్ ను మిస్ కావొద్దని సూచించారు.
అయితే జేసన్ సంజయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సిగ్మా సినిమాపైనా ఆసక్తిని పెంచుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడైన జేసన్.. సిగ్మాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. దీంతో తన హీరో నటించిన మరో ప్రాజెక్టుపై జేసన్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. సూపర్ సుబ్బులో సందీప్ కిషన్ యాక్టింగ్ జేసన్ ను ఎంతగానో ఆకట్టుకున్నట్లు ఆయన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.
మరి తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిగ్మాలో సందీప్ ను జేసన్ ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు విభిన్న పాత్రలు చేసిన సందీప్ కిషన్ కు సిగ్మా మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందా? జేసన్ తన తొలి సినిమాతో హీరోలోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొస్తారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు జేసన్ సంజయ్ వర్క్ పై గతంలో సందీప్ కిషన్ కూడా ప్రశంసలు కురిపించారు.
సినిమాపై జేసన్ కు క్లియర్ విజన్ ఉందని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేస్తారని తెలిపారు. ఇప్పుడు సందీప్ నటించిన సూపర్ సుబ్బు సిరీస్ పై జేసన్ ప్రశంసలు కురిపించడంతో.. వీరిద్దరి మధ్య మంచి వర్కింగ్ బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సిగ్మాకు ప్రధాన బలంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడికి హీరో స్టామినాపై పూర్తి అవగాహన ఉండటం పనికొస్తుందననే చెప్పాలి.
అదే సమయంలో హీరోకు దర్శకుడి విజన్ పై నమ్మకం ఉండటం సినిమా రిజల్ట్ పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశముంది. ఏదేమైనా సూపర్ సుబ్బు జేసన్ సంజయ్ కు తెగ నచ్చేసింది. సందీప్ కిషన్ యాక్టింగ్ కు ఆయన నుంచి మంచి మార్కులే పడ్డాయి. మరి తన తొలి చిత్రం సిగ్మాలో ఇదే సందీప్ కిషన్ ను జేసన్ ఏ రేంజ్ లో ప్రజెంట్ చేశారన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
