బ్రేకప్ అయ్యాకే 'సిగ్మా' వర్క్స్.. సీఎం కొడుకు సీక్రెట్ రివీల్
అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన ప్రేమకథ గురించి మాట్లాడారు.
By: M Prashanth | 5 Oct 2026 10:39 PM ISTడెబ్యూ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. దర్శకుడిగా జేసన్ సంజయ్ పేరు మాత్రం ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. దీనికి కారణం సిగ్మా మూవీ ఒక్కటే కాదు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ విషయాన్ని ఆయన తొలిసారి బయటపెట్టడం కూడా చర్చకు కారణమైంది. ఓ ప్రేమకథ.. ఆ తర్వాత బ్రేకప్.. చివరికి సినిమాపై ఫోకస్. ఇదే తన జీవితంలో జరిగిన మార్పు అంటూ సంజయ్ చెప్పుకొచ్చారు.
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్. తండ్రి స్టార్ హీరో కావడంతో చిన్నప్పటి నుంచే ఆయనపై అభిమానుల్లో ఆసక్తి ఉంది. విజయ్ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇస్తారని చాలామంది భావించారు. కానీ జేసన్ మాత్రం యాక్టింగ్ వైపు వెళ్లకుండా డైరెక్షన్ ను ఎంచుకున్నారు. సిగ్మా మూవీతో దర్శకుడిగా తన జర్నీని మొదలుపెట్టారు.
అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన ప్రేమకథ గురించి మాట్లాడారు. తన జీవితంలో ఒకే ఒక్క లవ్ స్టోరీ ఉందని చెప్పారు. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయితో ఏడాదిన్నర పాటు రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలిపారు. ఆ దూరం చివరకు వారి రిలేషన్ పై ఎఫెక్ట్ చూపిందట. ఇద్దరం మాట్లాడుకుని, పరస్పర అంగీకారంతోనే ఆ రిలేషన్ కు ముగింపు పలికామని జేసన్ చెప్పారు.
అంటే ఎలాంటి గొడవలు, పెద్ద సమస్యలు లేకుండానే బ్రేకప్ జరిగిందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే బ్రేకప్ తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటపడటం అంత ఈజీ కాలేదట. ఆ సమయంలో యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ ఎక్కువగా వినేవాడినని జేసన్ తెలిపారు. అదే సమయంలో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు చెప్పారు. పాత మెమోరీస్ మళ్లీ గుర్తుకురాకుండా ఉండేందుకే సోషల్ మీడియాలో స్టోరీలు పెట్టడం కూడా ఆపేశానని వెల్లడించారు.
ఇక తనను తాను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొన్ని విషయాలకు దూరంగా ఉన్నానని జేసన్ చెప్పారు. గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండకుండా తన పనిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆ బ్రేకప్ తర్వాతే సిగ్మా పనుల్లో పూర్తిగా బిజీ అయ్యానని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని, లైఫ్ ఫ్లీగా సాగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇలా జేసన్ బయటపెట్టిన ఈ వ్యక్తిగత విషయం ఇప్పుడు సిగ్మా కంటే ఎక్కువగా చర్చకు వస్తోంది.
సీఎం కొడుకు, స్టార్ హీరో విజయ్ వారసుడు అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని ఇంతకాలం బయటకు రానివ్వని జేసన్.. తొలిసారి తన లవ్, బ్రేకప్ గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఇక సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సిగ్మాకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న రేంజ్ లో మూవీ ఆకట్టుకోపోయినా.. జేసన్ సంజయ్ పై అందరి ఫోకస్ పడింది.
