Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో పోటీ ప‌డిన‌ట్లు ఈసారి జ‌పాన్లో ప‌డాలేమో!

టాలీవుడ్ స్టార్ హీరోల మ‌ధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుంద‌న్నది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   6 Dec 2025 5:00 PM IST
టాలీవుడ్ లో పోటీ ప‌డిన‌ట్లు ఈసారి జ‌పాన్లో ప‌డాలేమో!
X

టాలీవుడ్ స్టార్ హీరోల మ‌ధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుంద‌న్నది చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్ల‌ను మిన‌హాయిస్తే త‌ర్వాత త‌రం న‌టులైన‌ మ‌హేష్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, బ‌న్నీ వంటి టైర్ వ‌న్ హీరోల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎప్ప‌టి క‌ప్పుడు క‌నిపిస్తుంది. ఈ హీరోల‌ను తెలుగు అభిమానులు ఎంత‌గానో ఆరాదిస్తారు. ఏ హీరోకి ఆ హీరో ప్రత్యేక‌మైన ప్యాన్ బేస్ క‌లిగి ఉన్నారు. ఒక‌ప్పుడు హీరోల పేరిట ఉండే సంఘాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ గ్రూప్ గా ఏర్ప‌డ్డాయి. హీరోల‌కు సంబంధించి ఎలాంటి యాక్టివిటీ అయినా సోష‌ల్ మీడియాలోనే జ‌రుగుతోంది.

సోష‌ల్ మీడియా లో సంఘాలుగా:

త‌మ అభిమాన హీరో సినిమాను పైకి ఎక్కించాల‌న్నా? పాతాళానికి తొక్కాల‌న్నా ఆ గ్రూప్ లే కీల‌కంగా మారుతున్నాయి. ఈ ర‌క‌మైన యాక్టివిటీ అభిమానుల మ‌ధ్య ఎన్నో వైరాల‌కు కూడా దారి తీస్తుంటుంది. ఇదంతా తెలుగు ఆడియ‌న్స్ కు బాగా అల‌వాటైన ప‌నే. ఇప్పుడిదే క్రేజ్ ఈ న‌యా స్టార్లు అంద‌రికీ జ‌పాన్ లో ఏర్ప‌డుతుంది.

`బాహుబ‌లి`, `క‌ల్కి` లాంటి సినిమాల‌తో ప్ర‌భాస్ జపాన్ ఇండియ‌న్స్ ద‌గ్గ‌ర‌వ్వ‌గా, `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ రీచ్ అయ్యారు. `దేవ‌ర` సినిమాతో తార‌క్ సోలోగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

జ‌పాన్ లో బ‌న్నీ హ‌డావుడి:

`వార‌ణాసి` త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ వీళ్లంద‌ర్నీ బీట్ చేస్తాడ‌నే అంచ‌నాలున్నాయి. ఒక్క హిట్ తోనే జపాన్ ని శాషిస్తాడ‌నే టాక్ అప్పుడే మొద‌లైపోయింది. ఇక బ‌న్నీ `పుష్ప‌2` తో జపాన్ లోకి ఎంట‌ర్ అవుతుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రిలో రిలీజ్ సంద‌ర్భంగా ఆ సినిమా ప్ర‌మోష‌న్ కు కోసం జపాన్ కి వెళ్తాడు బ‌న్నీ. అనంత‌రం బ‌న్నీ 26వ చిత్రం కూడా జ‌పాన్ వెళ్ల‌డం లాంఛ‌న‌మే. అట్లీ ఈ చిత్రాన్ని గ్లోబ‌ల్ స్థాయిలో క‌నెక్ట్ చేయాల‌ని చూస్తోన్న సంగతి తెలిసిందే.

జ‌పాన్ లోనూ హీరోల మ‌ధ్య పోటీ:

వీళ్ల‌కి కూడా ప్యాన్ బేస్ ఏర్ప‌డిందంటే? అక్క‌డా కుమ్ములాట త‌ప్ప‌దేమో. జ‌పాన్ అభిమానులు కూడా తెలుగు అభిమానుల‌కు ఎంత మాత్రం తీసిపోరు. ఫోటోల కోసం, సంత‌కాల కోసం జ‌పానోళ్లు ఎలా పోటీ ప‌డుతున్నారో? తారక్ అమెరికా ఈవెంట్ వేదిక‌గా చూసాం. కంచెలు బిగించినా వాటిని దాటుకుని రావ‌డం కోసం సాహ‌స‌మే చేసాడు ఓ అభిమాని. ప్ర‌భాస్ అభిమానులు అయితే అత‌డి బ‌ర్త్ డే కోసం ఏకంగా జపాన్ నుంచి హైద‌రాబాద్ కే వ‌చ్చేసారు. ఇలా ఇంత గొప్ప బాండింగ్ జ‌పాన్ అభిమ‌నుల‌తో తెలుగు హీరోలు ఏర్ప‌రుచుకుంటున్నారు. భ‌విష్య‌త్ లో ఈ అభిమానం పీక్స్ కు చేరుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం టాలీవుడ్ హీరోల మ‌ధ్య జ‌పాన్ లో పోటీ కూడా అలాగే ఉంటుంది.