Begin typing your search above and press return to search.

నా సినిమా స్టోరీని కాపీ కొట్టి యానిమల్ సినిమా తీశారు

బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ దర్శన్.. ఇటీవల యానిమల్ సినిమాపై తన అభిప్రాయం పంచుకున్నారు.

By:  M Prashanth   |   6 Aug 2025 3:44 PM IST
నా సినిమా స్టోరీని కాపీ కొట్టి యానిమల్ సినిమా తీశారు
X

సెన్సేషనల్ డైరెర్టర్ సందీప్ రెడ్డి వంగ 2023 తెరకెక్కిన యానిమల్ సూపర్ హిట్ అయ్యింది. రణ్ బీర్ కపూర్, రష్మిక మంధన్నా లీడ్ రోల్ లో నటించారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కథగా సాగుతుందీ సినిమా. థియేటర్ రన్ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అంటారా?

బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ దర్శన్.. ఇటీవల యానిమల్ సినిమాపై తన అభిప్రాయం పంచుకున్నారు. 1999లో అక్షయ్ కుమార్ హీరోగా తాను తెరకెక్కించిన జాన్ వర్ (జంతువు) ఈ సినిమా స్టోరీ లైన్ తో యానిమల్ సినిమా కథను పోలి ఉంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలోనూ తాను తెరకెక్కించిన సినిమాలు చాలానే కాపీ చేశారని, యానిమల్ కూడా అందులో భాగమేనని అన్నారు. అలాగే తాను స్వయంగా తెరకెక్కించిన సినిమాలను ఇలా కాపీ చేయడం వల్ల ఇప్పుడు ఆయన సినిమాలకు ఆయనే రీమేక్ చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన జాన్వర్ గురించి మాట్లాడుతూ.. జాన్వర్ ను ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆ కథ ఏమిటి? మీరు యానిమల్ సినిమా చూశారా? చూస్తే మీకు కథంటో అర్థం అవుతుంది. అని ప్రశ్నించాడు.

అయితే ఆయన తాజా కామెంట్స్ బట్టి చూస్తే.. ఈ రెండు సినిమాల మధ్య ఏదో బలమైన కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ఈ విషయంలో దర్శన్ ఎవరినీ నిందించలేదు. జాన్వర్, యానిమల్ రెండు సినిమాలు వైలెన్స్, భావోద్వేగ సన్నివేశాలేనని దర్శన్ వివరించారు. కాగా, తాను దత్తత తీసుకున్న బిడ్డ కోసం నేరస్థుడిగా మారిన కథే జాన్వర్ సినిమా కాగా, అంతర్గత కోపం, తండ్రిని కాపాడుకుంటూ ఆయనపై ఉన్న ప్రేమను తెలిపే కాథాంశమే యానిమల్ స్టోరీ.

ఈ రెండు సినిమాలు కూడా ఫుల్ ఆఫ్ వైలెన్స్, యాక్షన్ సీన్స్ తో ఉంటాయి. ఏదైమైనప్పటికీ దర్శన్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను మెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా స్టోరీలైన్ ను తన సినిమా నుంచి తీసుకున్నారని ఒప్పుకుంటే బాగుండేదని అన్నారు. మరోవైపు ఈ విషయంపై యానిమల్ సినిమా బృందం నుండి ఎవరూ స్పందించలేదు.