Begin typing your search above and press return to search.

జాన్వీ జీవితంలో గొప్ప రివార్డు

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జాన్వీ క‌పూర్ న‌టించిన హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ ద‌క్కించుకోవ‌డం విశేషంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Sept 2025 1:38 PM IST
జాన్వీ జీవితంలో గొప్ప రివార్డు
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి కాలు క‌దిపిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు ఎంపికై, ఆఖ‌రికి అవార్డును కూడా ద‌క్కించుకుంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ లోని సాంగ్ ను గ‌తేడాది ఆస్కార్ వ‌రించిన‌ విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత నుంచి ఇండియా త‌ర‌పున త‌ర్వాతి ఆస్కార్ అందుకోబోయేదెవ‌రని అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

ఆస్కార్ లో ఎంట్రీ సాధించిన హోమ్ బౌండ్

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జాన్వీ క‌పూర్ న‌టించిన హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ ద‌క్కించుకోవ‌డం విశేషంగా మారింది. నీర‌జ్ గైవాన్ ద‌ర్శ‌క‌త్వంలో జాన్వీ క‌పూర్, ఇషాన్ ఖట్ట‌ర్, విశాల్ జ‌త్వా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా 2026 అకాడమీ అవార్డుల్లో ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో అఫీషియ‌ల్ ఎంట్రీ ద‌క్కించుకున్న‌ట్టు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది.

దీంతో హోమ్ బౌండ్ చిత్ర యూనిట్ ఎంతో ఎగ్జైట్ అవుతూ ఆ స‌క్సెస్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ త‌మ ఆనందాన్ని పంచ‌కుంటున్నారు. నార్త్ ఇండియాలో ఓ చిన్న గ్రామానికి చెందిన ఇద్ద‌రు యువ‌కులు పోలీసులు కావాల‌ని క‌లలు కంటారు. చిన్నప్ప‌ట్నుంచి కుల వివ‌క్ష ఎదుర్కొన్న వాళ్లు పోలీసులైతే స‌మాజంలో ప్ర‌తీ ఒక్క‌రి నుంచి గౌర‌వం ద‌క్కుతుంద‌ని భావిస్తారు. పోలీస్ కావాల‌నే త‌మ టార్గెట్ ను చేరుకునే ప్ర‌య‌త్నంలో వారిద్ద‌రి జ‌ర్నీ, ఆ జ‌ర్నీలో వారి ఇబ్బందుల నేప‌థ్యంలో హోమ్ బౌండ్ తెర‌కెక్కింది.

ఇప్ప‌టికే ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ లో గుర్తింపు

ఈ సినిమాలో భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉంద‌ని చెప్తున్న జాన్వీ క‌పూర్, హోమ్ బౌండ్ ను త‌న జీవితానికి ఓ గొప్ప రివార్డుగా భావిస్తున్న‌ట్టు తెలిపారు. కాగా ఇప్ప‌టికే హోమ్ బౌండ్ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ గుర్తింపును పొందింది. మే నెల‌లో జ‌రిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఈ సినిమా స్క్రీనింగ్ జ‌ర‌గ్గా, సినిమా చూశాక అంద‌రూ దీనికి స్టాండింగ్ ఓవియేష‌న్ ఇచ్చారు. ఆ త‌ర్వాత టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో పీపుల్స్ ఛాయిస్ విభాగంలో సెకండ్ ర‌న్న‌ర‌ప్ అవార్డును కూడా ద‌క్కించుకుంది హోమ్ బౌండ్.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆస్కార్ తెచ్చేది ఈ సినిమానేనా?

బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ‌డంతో త‌న టీమ్ ను అభినందిస్తూ, ఇదొక పెద్ద గౌర‌వం అని ఆయ‌న తెలిపారు. అకాడ‌మీ అవార్డుల ఫైన‌ల్ షార్ట్ లిస్ట్ లో చోటు కోసం ఈ సినిమా 100కి పైగా ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాల‌తో పోటీ ప‌డ‌నుంది. మ‌రి ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఇండియాకు ఆస్కార్ ను తెచ్చే సినిమాగా హోమ్ బౌండ్ నిలుస్తుందో లేదో చూడాలి. అయితే కెరీర్ ను స్టార్ట్ చేసి ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ జాన్వీకి ఇప్ప‌టివ‌ర‌కు గ‌ర్వంగా చెప్పుకోద‌గ్గ సినిమా ఒక్క‌టీ ప‌డ‌లేదు. అలాంటి టైమ్ లో అమ్మ‌డు న‌టించిన హోమ్ బౌండ్ ఆస్కార్ కు ఎంపిక‌వ‌డం జాన్వీకి, త‌న కెరీర్ కు మంచి బూస్ట‌ప్ ను ఇస్తుంది. ఈ జోష్ లో జాన్వీ త‌న కెరీర్లో మ‌రిన్ని మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకునే వీలుంది. కాగా హోమ్ బౌండ్ సినిమా సెప్టెంబ‌ర్ 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఆస్కార్ ఎంట్రీ నేప‌థ్యంలో ఈ సినిమాపై ఆడియ‌న్స్ లో స్పెష‌ల్ ఇంట్రెస్ట్ ఏర్ప‌డే అవ‌కాశ‌ముంది.