US బాక్సాఫీస్.. జనవరి 'రిపోర్ట్' ఎలా ఉందంటే?
అప్పుడే జనవరి మంత్ కంప్లీట్ అయిపోయింది. అయితే గత నెల నార్త్ అమెరికా బాక్సాఫీస్ సినీ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: M Prashanth | 1 Feb 2026 11:54 PM ISTఅప్పుడే జనవరి మంత్ కంప్లీట్ అయిపోయింది. అయితే గత నెల నార్త్ అమెరికా బాక్సాఫీస్ సినీ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివిధ తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. కొన్ని హిట్స్ గా నిలిచాయి.. మరికొన్ని ఫ్లాప్ గా మారాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు మాత్రం వచ్చాయి. సుమారు 8.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలైనట్లు తెలుస్తోంది.
అయితే సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ.. జనవరి విన్నర్ గా యూఎస్ బాక్సాఫీస్ వద్ద నిలిచింది. 3.34 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ గ్రాసర్ గా నిలిచింది. ప్రతి వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు రావడం, పాజిటివ్ మౌత్ టాక్ కలిసి రావడంతో మంచి కలెక్షన్స్ సాధించింది. అనగనగా ఒక రాజు మూవీ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
ఆ చిత్రం 1.76 మిలియన్ డాలర్లు వసూలు చేసి హిట్ స్టేటస్ దక్కించుకుంది. కంటెంట్ అందరినీ మెప్పించేలా ఉండడంతో మంచి మద్దతు లభించింది. నారీ నారీ నడుమ మురారి’ 7.58 లక్షల డాలర్లు రాబట్టి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. పరిమిత స్క్రీన్లు ఉన్నా చివర్లో పుంజుకోవడం సినిమాకు సహాయపడింది. ఇంకా ఎక్కువ స్క్రీన్స్ లభించి ఉంటే భారీ వసూళ్లు వచ్చేవి,
అయితే ది రాజా సాబ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం ఉత్తర అమెరికాలో 2.356 మిలియన్ డాలర్లకే ఆగిపోయి డిజాస్టర్ గా మారింది. ఇందులో యూఎస్ నుంచి 2.168 మిలియన్, కెనడా నుంచి 1.88 లక్షల డాలర్లు వచ్చాయి. భాషల వారీగా చూస్తే తెలుగు వెర్షన్ నే ఎక్కువగా వసూలు చేయగా, హిందీ, తమిళ వెర్షన్లకు స్పందన చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
రవితేజ నటించిన‘భర్త మహాశయులకు విజ్ఞప్తి కేవలం 2.13 లక్షల డాలర్లకే పరిమితమై ఫ్లాప్‌గా నిలిచింది. రీసెంట్ గా విడుదలైన ఓం శాంతి శాంతి శాంతిహి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓపెనింగ్స్ డల్ గానే ఉన్నాయి. మొత్తం 35 వేల డాలర్లే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే జనవరిలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ డామినేషన్ చూపించి.. భారీ వసూళ్లు సాధించింది.
అదే సమయంలో సంక్రాంతికి ఒకేసారి అన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం.. బాక్సాఫీస్ వద్ద ఇబ్బందిగా మారింది. నారీ నారీ నడుమ మురారి మూవీ మంచి టాక్ అందుకున్నా.. స్క్రీన్స్ సరిపడా దొరకలేదు. రాజా సాబ్ ఎక్కువ థియేటర్స్ లో ఉన్నా.. కంటెంట్ అనుకున్నట్లు లేకపోవడంతో ఆ సినిమా వసూళ్లు తగ్గాయి. రెండో వీకెండ్ లో కీలక ప్రాంతాల్లో మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. లేకుంటే జనవరిలో తెలుగు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు సాధించేవని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
