Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్.. పెద్దిలో ఎన్ని పాటలు?

ఇప్పుడు జానీ మాస్టర్ కూడా శ్రీలంకలో కనిపించడంతో, ఆయన కూడా 'పెద్ది' సాంగ్ షూటింగ్ కోసమే వెళ్లారా అనే డిస్కషన్ మొదలైంది.

By:  M Prashanth   |   29 Oct 2025 11:00 PM IST
జానీ మాస్టర్.. పెద్దిలో ఎన్ని పాటలు?
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన శ్రీలంకలో ఉన్నట్లు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. "శ్రీలంకలోని లవ్లీ లొకేషన్స్‌లో నా ప్రేమతో (తన భార్యతో)" అని క్యాప్షన్ పెట్టి, ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు.

ఈ పోస్ట్ చూడగానే అందరి మైండ్‌లో మెదిలిన మొదటి సినిమా.. రామ్ చరణ్ 'పెద్ది'. ఎందుకంటే, రీసెంట్‌గానే 'పెద్ది' టీమ్ ఒక సాంగ్ షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లింది. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. ఇలా కీ టీమ్ మెంబర్స్ అంతా అక్కడే ఉన్నారు. చరణ్, జాన్వీ కపూర్‌లపై ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను అక్కడ షూట్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు జానీ మాస్టర్ కూడా శ్రీలంకలో కనిపించడంతో, ఆయన కూడా 'పెద్ది' సాంగ్ షూటింగ్ కోసమే వెళ్లారా అనే డిస్కషన్ మొదలైంది. నిజానికి, 'పెద్ది' సినిమాలో ఒక పక్కా మాస్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. బహుశా ఆ సాంగ్ షూటింగ్ పూర్తయిపోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు శ్రీలంకలో షూట్ చేస్తున్నది రెండో పాటా అనే డౌట్ కలుగుతోంది.

ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి పాట అయి ఉంటుంది? చరణ్, జాన్వీలపై తీస్తున్న రొమాంటిక్ లేదా మెలోడీ సాంగ్‌కు కూడా జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేస్తున్నారా? ఇది కొంచెం ఆశ్చర్యమే. ఎందుకంటే జానీ మాస్టర్ మాస్ స్టెప్పులకు పెట్టింది పేరు. అయితే, ఆయన మెలోడీలను కూడా అంతే అందంగా కొరియోగ్రాఫ్ చేయగలరు.

ఈ పోస్ట్ పై మరో టాక్ కూడా హైలెట్ అవుతోంది. జానీ మాస్టర్ శ్రీలంకకు వేరే ఏదైనా సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఉండొచ్చు. ఆయన చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం 'పెద్ది' టీమ్ అక్కడుంది కాబట్టి, ఆ సినిమా కోసమే వెళ్లారని ఫిక్స్ అవ్వలేమని మరికొందరు అంటున్నారు. అయితే, టైమింగ్, లొకేషన్ రెండూ కరెక్ట్‌గా సింక్ అవ్వడంతో, ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

ప్రస్తుతానికి జానీ మాస్టర్ శ్రీలంక ట్రిప్ వెనుక అసలు కారణం ఏంటో తెలియదు. అది 'పెద్ది' కోసమా, వేరే ప్రాజెక్ట్ కోసమా, లేక కేవలం పర్సనల్ వెకేషనా అనేది తెలియాలంటే అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా, 'పెద్ది' ఆల్బమ్‌పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జానీ మాస్టర్ స్టెప్పులు.. కాంబినేషన్ అదిరిపోవడం ఖాయం.