పిక్‌టాక్ : సన్నీ-తులసీ రొమాంటిక్ ఫోజ్
జాన్వీ కపూర్ నటించిన 'పరమ్ సుందరి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 19 Sept 2025 4:00 PM ISTజాన్వీ కపూర్ నటించిన 'పరమ్ సుందరి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమాలోని రెయిన్ సాంగ్ తో పాటు, కొన్ని రొమాంటిక్ సీన్స్ బూడిదలో పోసిన పన్నీరు మాదిరి ఉన్నాయి అంటూ చాలా మంది రివ్యూవర్స్ అసహనం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్ ఇలాంటి చెత్త సినిమాలు వెతికి మరీ పట్టుకుంటుందా అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. యాక్టింగ్ పరంగానూ ఆమెను టార్గెట్ చేస్తున్న వారు ఉన్నారు. ఆ సినిమా ఫ్లాప్ నుంచి బయట పడి, దాన్ని మరిచి పోయి జాన్వీ కపూర్ తన కొత్త సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ప్రమోషన్‌లో బిజీ అయింది. ఈ సినిమాపైనా జాన్వీ కపూర్ చాలా నమ్మకంగా కనిపిస్తుంది. ఈ సినిమాలోనూ ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే.
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ రొమాంటిక్ ఫోజ్
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో సన్యా మల్హోత్ర, రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెయార్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విభిన్నమైన ప్రేమ కథ, బ్రేకప్ ప్రేమ కథను ఈ సినిమాలో చూపిస్తారు అంటూ లైన్ ను బట్టి అర్థం అవుతుంది. సినిమాలో జాన్వీ కపూర్ కొత్త యాంగిల్ ఏమీ ఉండక పోవచ్చు, కానీ కొత్తగా తనను తాను చూపించుకునే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు. సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా, పాటలు, టీజర్, ట్రైలర్‌ను వదులుతున్నారు. వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్‌తో ఉన్న రొమాంటిక్ ఫోజ్ ఇచ్చిన స్టిల్స్‌ను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా సినిమా స్థాయిని పెంచినట్లు అయింది.
సన్నీ సంస్కారికి తులసి కుమారి
స్టైలిష్ అవతార్ లో వరుణ్ ధావన్ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ సైత చాలా స్టైలిష్‌గా నడుము అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. చాలా రొమాంటిక్‌గా జాన్వీ నడుముకు ఉన్న ఒక చైన్ ను పట్టుకుని వరుణ్ ధావన్ ఉండగా, ఆమె రొమాంటిక్‌గా నడుము పై చేయి వేసి ఫోజ్ ఇచ్చింది. ఈ రొమాంటిక్ ఫోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో ఇలాంటివి చాలానే ఉండి ఉంటాయని, జాన్వీ కపూర్ అంటేనే స్కిన్ షో సీన్స్ కు పెట్టింది పేరు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆమె అందాలను చూసేందుకు అయినా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి రొమాంటిక్ ఫోజ్‌లను హీరో, హీరోయిన్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఆకట్టుకునే అందంతో జాన్వీ కపూర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్య పాత్రలో సన్యా మల్హోత్ర
దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ తెగ సందడి చేస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. అయితే సినిమాలో ఉన్న ట్యాలెంటెడ్ డాన్సర్ కమ్ యాక్టర్ అయిన సన్యా మల్హోత్రకు ఈ సినిమాలె పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అని, ఆమెతో కనీసం చిన్న డాన్స్ మూవ్ కూడా చేయించలేదు అంటూ విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు సన్యాకు సంబంధించి మంచి హైప్ ఇచ్చే వీడియోలు, ఫోటోలు విడుదల చేయలేదు. కనీసం సినిమాలో అయినా ఆమెకు ప్రాధాన్యత ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సినిమా యొక్క ప్రమోషన్‌లో సన్యాను ఎక్కువగా చూడటం లేదు. జాన్వీ కపూర్ రొమాంటిక్ అందాలు, స్కిన్ షో ఫోజ్‌లను మాత్రమే ప్రేక్షకులు ఇప్పటి వరకు చూస్తున్నారు.
