Begin typing your search above and press return to search.

జాన్వీ కొత్త మూవీ.. టెంపుల్ విజిట్స్ హెల్ప్ అవుతాయా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పరమ్ సుందరి మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

By:  M Prashanth   |   29 Aug 2025 6:04 PM IST
జాన్వీ కొత్త మూవీ.. టెంపుల్ విజిట్స్ హెల్ప్ అవుతాయా?
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పరమ్ సుందరి మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ డైరెక్టర్ తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.

దినేష్ విజన్ నిర్మించిన ఆ సినిమాలో సిద్ధార్థ్ పంజాబీ అబ్బాయిగా, జాన్వీ కపూర్ కేరళ యువతిగా నటించారు. రేంజి పనికర్, సిద్ధార్థ్ శంకర్, మంజోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సచిన్ జిగర్ మ్యూజిక్ అందించారు. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

అయితే నేడు రిలీజ్ అయిన మూవీ.. అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం లేదు. అదే సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా ఉండడం వల్ల రూ.10 కోట్ల ఓపెనింగ్స్ ఉండవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరిగి ఉంటే బాగా వచ్చేవని చెబుతున్నారు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో హీరోహీరోయిన్ల డివోషనల్ ట్రిప్స్ కోసం నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. రిలీజ్ కు ముందు జాన్వీ, సిద్ధార్థ్ దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సందడి చేశారు. శ్రీదేవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 14న జాన్వీ, సిద్ధార్థ్ తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామి వారిని దర్శించారు.

ఆ తర్వాత ఆగస్టు 24న మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లిన వారిద్దరూ.. ఆగస్టు 28న షిర్డీ సాయి బాబా ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రీసెంట్ గా గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా వారు లాల్‌ బాగ్చ రాజాను సందర్శించారు. ముంబైలోని ప్రముఖ గణనాథుడి మండపానికి వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అయితే అందుకు సంబంధించిన వీడియోలు ఫుల్ వైరల్ కాగా.. కొందరు నిజంగా ఆశీర్వాదాలు కోరుతున్నారని భావించగా, మరికొందరు ఇది ప్రచార వ్యూహమని అన్నారు. ఒకవేళ నిజంగా దర్శనాలు అయితే పీఆర్ లు ఎందుకు అంతగా ప్రచారం చేస్తారని అన్నారు. అయితే ఆలయ సందర్శనలు రాబోయే వారంలో పరమ్ సుందరి బాక్సాఫీస్ వద్ద మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి సహాయపడతాయో లేదో చూడాలని అంటున్నారు.